కెసిఆర్ మా ఆశలు తప్పక నెరవేరుస్తారు: టిఎన్జీవొ నేతల కొండంత ఆశ

తెలంగాణ ఉద్యోగుల జెఎసి పక్షాన ఈ రోజు నేతలు పద్మచారి(తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు),పవన్ కుమార్ గౌడ్( తెలంగాణ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ) తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సీఎస్ సోమేశ్ కుమార్ కలిశారు.
పేరివిజన్ కమిషన్ (పిఆర్  సి)గడువు పెంచుతూ నిన్న వచ్చిన జిఓ తో చాలా మంది ఉద్యోగులు ఆందోళనలు చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనికి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ ‘ పీఆర్సీ కమిషన్ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చెయ్యలేదు. ఉద్యోగుల అనేక విషయాల కోసం స్టడీ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగుల ఇతర సమస్యలపై స్టడీ కోసం దీన్ని పొడిగించాం,’ అనిచెప్పారు.
అంతేకాదు, ‘ పిఆర్సీ నివేదిక సిద్ధంగా ఉంది నెల లోపల కమిషన్ రిపోర్ట్ అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు,’అని కూడా  హామీ ఇచ్చారు.
అనంతరం నేతలు  మాట్లాడుతూ ఇలా చెప్పారు:
 తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అనేక సమస్యలపై పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా ఉండేందుకు మన వంతు సాయం చేస్తాం.  ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాకు అండగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తాను ఉన్నానని ని అనేక సార్లు చెప్పారు.
త్వరలోనే పీఆర్సీ వస్తుంది అని సీఎస్ కూడా చెప్పారు.
మార్చి నెలలో పీఆర్సీ వస్తుంది ,త్వరలోనే మన ఉద్యోగ సంఘాల ను పిలిసి మాట్లాడుతాను చెప్పారు. గౌరవప్రదమైన పీఆర్సీ వస్తుంది ఆశిస్తున్నాము, ఏ ఉద్యోగి కూడా నష్టపోకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.ఇహెచ్ఎస్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా కింది స్థాయి ఉద్యోగులకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే రెండు పీఆర్సీ లు కోల్పోయాం
తెలంగాణ ఉద్యమం లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమం కు మొదటి ప్రియార్టీ ఇచ్చారు సీఎం కేసీఆర్
మేము తెలంగాణ కోసం కష్టపడి పని చేస్తున్నాం మా ఉద్యోగ సంఘాలకు కూడా పీఆర్సీ ఇస్తాడని ఆశిస్తున్నాము.
కొత్త జిల్లాలో స్టాఫ్ లేకున్నా పని ఎక్కువ అయిన చేశాం.
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయి.
విదేశీ విద్య కోసం ప్రత్యేకంగా రుణాలు ఇస్తున్నారు.రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఉద్యోగుల పీఆర్సీ తోపాటు ఉద్యోగుల వయోపరిమితి ,ఎపి లో ఉన్న 4వ తరగతి ఉద్యోగుల సమస్యపై త్వరలో సీఎం కేసీఆర్ నెరవేస్తారని నమ్మకం ఉంది.
టీజీఓ అధ్యక్షురాలు మమత వ్యాఖ్యలు
నిన్న పీఆర్సీ గడువు పెంచుతూ జిఓ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారు.ఈ సంవత్సరం కూడా జీతాలు పెంచరని  అని ఆందోళన చెందారు. దీనిపై ఇవ్వాళ సీఎస్ ను కలిసి ఆడిగాం. సీఎస్ కూడా మాకు గడువు పెంపుపై ఆందోళన వద్దు అని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు.
సీఎం కేసీఆర్ మాకు పీఆర్సీ ఇస్తాం అని చెప్పారు
పీఆర్సీ కి ఈ గడువు పొడిగింపు తో సంబంధం లేదు
ఏప్రిల్ నుండి పీఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగ జేఏసీ భేటీ అవుతుంది.
ఒక్కవేళ పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేస్తాం.