కొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, విశేషాలివే…

తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2020-21 బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం  ప్రారంభం అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాలే అయినా, ఈ సమావేశానికి మరొక ప్రాముఖ్యం ఉండవోతన్నది. రాష్ట్రప్రభుత్వం ఇప్పికే సిఎఎ, ఎన్  పిఆర్, ఎన్ ఆర్ సిలను వ్యతిరేకించింది. క్యాబినెట్ కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానించింది. అందువల్ల ఈ తీర్మానాలకు అనుకూలంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపవచ్చు. అదే జరిగితే, ఈ అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో మిగిలిపోతాయి.
2019 సెప్టెంబరులో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి  శానం సైదిరెడ్డి ఎమ్మెల్యేగా   ఈ సమావేశాలకు హాజరవుతాారు.  మరొక  విశేషం ఈ సమావేశాలలోనే రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం ఈ సారి రెండు రాజ్యసభ ఖాళీలు ఏర్పడ్డాయి.
ఈ ఉదయం 11 గంటలకు ఉభయసభల ఉమ్మడి సమావేశంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్  ప్రసంగిస్తారు.
 తొలిసారిగా గవర్నర్‌ తమిళసై ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడతున్నారు.
గవర్నర్‌ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలిల సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది.
సమావేశాలు ఎన్నిరోజులు సాగేది ఇందులో ఖరారు చేస్తారు.
టైం టేబుల్ ఇది
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ నెల 7 వ తేదీన చర్చ ఉంటుంది.
ఈ నెల 8న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు.
మార్చి 9న హోలీ సెలవు దినం.
మార్చి 10  నుంచి 23 వరకు సమావేశాలు కొనసాగ వచ్చనుకుంటున్నారు.
మొత్తంగా 13 రోజుల పాటు శాసనసభను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే,  శాసనమండలి సమావేశాలు నాలుగు నుంచి అయిదు రోజుల పాటే జరిగ వచ్చు.
గత సెప్టెంబరు 22న శాసనసభ, మండలి సమావేశాలు వాయిదా పడ్డాక  దాదాపు ఆరు నెలలకు జరుగుతున్న సమావేశాలు ఇది.
 తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు ఇవే.
గత ఏడాది పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టారు.  ఆ తర్వాత సెప్టెంబరులో మిగిలిన ఆరు నెలల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇప్పుడు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి  వార్షిక బడ్జెట్‌ వస్తోంది.
దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి పన్నులు, గ్రాంట్ల తగ్గుదల, కరోనా  పరిణామాల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి.
రాష్టం నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో  కొత్త పథకాలు, కార్యక్రమాల ప్రకటించక పోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
ఇతర విషయాలకు వస్తే,  కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే వీలుంది.అలాగే,  భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌ బీపాస్‌ చట్టాన్ని కూడా  ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చు.