ఆ శామ్యూలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్!, టిడిపి విస్మయం

రాష్ట్రఎన్నికలకమిషనర్ గా ఎవరిని నియమించాలనే ప్రభుత్వ ప్రతిపాదనలో గవర్నర్ కు మూడుపేర్లు పంపారని, వారిలో శామ్యూల్ అనే ఐఏఎస్ అధికారి పట్ల మొగ్గుచూపుతున్నట్లు ప్రభుత్వం సంకేతం పంపిందని, టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

జగన్ అవినీతికేసుల్లో శామ్యూల్ ముద్దాయిగా కూడా ఉన్నారరి వాన్ పిక్ కేసుల్లో ఏ1 జగన్మోహన్ రెడ్డి అయితే ఏ8గా శామ్యూల్ ఉన్నారని చెబుతూ ఆ శామ్యూల్ నే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకమిషనర్ గా నియ మించాలని చూస్తోందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం పట్ల విస్మయం ప్రకటించి, ఇలాంటి సిఫార్సు ఒకె చేయవద్దని రామయ్య గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైరైన తర్వాత, ఎవరినైతే కోవిడ్ సమయంలో రమేశ్ కుమార్ స్థానంలో నియమించాలని తీసుకొచ్చారో, సదరువ్యక్తి దళితవర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్. అతను న్యాయశాస్త్ర కోవిదుడని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కంటే సమర్థుడని, దళితుడ ని, కాబట్టి అతనికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు ఆనాడు ప్రభుత్వం చెప్పింది.

అప్పుడు ఆఘమేఘాలపై కనగరాజ్ ను తీసుకొచ్చి, రాత్రికి రాత్రి రమేశ్ కుమార్ స్థానంలో నియమించారు. కోర్టు ఆదేశాలతో ఆ నియామ కం కాస్త ప్రభుత్వానికి బెడిసికొట్టింది. ఇప్పుడు మార్గం సుగమమైంది కాబట్టి, నెలాఖరుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైరవుతున్నారు కాబట్టి, న్యాయశాస్త్ర కోవిదు డు, దళితుడు, శక్తియుక్తిసామర్థ్యాలున్న కనగరాజ్ ను నియమించాలి కదా? ఆయన్ని నియమించకపోగా, ఆయన పేరు గవర్నర్ కు పంపగపోగా, ఇప్పుడు కొత్త పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించడమేంటి?

ఎమ్. శామ్యూల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అతను జగన్మోహ న్ రెడ్డికి సలహాదారుగా కూడా పనిచేశారు. నవరత్నాలు అమలు కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

తెలుగుదేశం నేత వర్ల రామయ్య

ఇదే శామ్యూల్ రాజశేఖర్ ప్రభుత్వంలో వివాదాస్పదమయిన  వాన్ పిక్ తోపాటు ఇందూటెక్ జోన్ కేసులో కూడా ముద్దాయగా (ఎ10)గా ఉన్నారు. అటు వంటి వ్యక్తి ప్రతిశుక్రవారం కోర్టులకు హాజరవుతున్నాడు. తనతోపాటు కోర్టులకు వస్తాడని ముఖ్యమంత్రి ఆయన్ని ఎంపికచేశారా?

అవినీతికేసుల్లో విచారణ ఎదుర్కొంటూ, కోర్టుల్లో నిలబడేవ్యక్తిని రాష్ట్ర ఎన్నికల క మిషనర్ గా నియమిస్తారా? రమేశ్ కుమార్ రిటైరయ్యాక కనగరాజ్ ను కదా నియమించాలి. ఆయ న్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసినట్టేనా? న్యాయకోవిదుడు, దళితుడైన కనగరాజ్ ను ఎందుకువద్దన్నారో… ఇప్పడుముద్దాయిని ఎందుకు కావాలనుకుంటున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ అన్ని విధాలా అర్హుడని వైసీపీ నేత అంబటి రాంబాబు గతంలో చెప్పిందంతా హంబట్టేనా? క

నగరాజ్ ను తోసిరాజని, తోటిముద్దాయిని, జగనతో పాటు కోర్టులో జీహుజూర్ అని నిలబడే శామ్యూల్ ను తెచ్చుకోవడమేంటి? ప్రతి శుక్రవారం జగన్ తోపాటు కోర్టుకు వస్తున్నాడనా…లేక యన అవినీతిలో శామ్యూల్ పాలుపంచుకున్నందుకా.. లేక కోట్లుసంపాదించుకోవడానికి జగన్ కు సహకరిం చాడని ఆయన్ని ఎన్నికలకమిషనర్ గా నియమిస్తు న్నారా? శామ్యూల్ కు ఉన్న అర్హతలేమిటో ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలి.

అవినీతికేసుల్లో ముఖ్య మంత్రితో అంటకాగిన వ్యక్తి చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం నడుస్తాడా? శామ్యూల్ ముఖ్యమంత్రి గీసిన గీత దాటుతాడా? అటువంటి వ్యక్తిని ఎన్నికలకమిషనర్ గా నియమించాలని చూడటం ఎంతవరకుసబబు? గవర్న ర్ కి తెలుగుదేశం పార్టీ అనేకవిజ్ఞప్తులుచేసింది. ఆయన కూడా న్యాయశాస్త్రకోవిదుడని విన్నాము. శామ్యూల్ వంటి వారిని వ్యవస్థలకు అధిపతిని చేస్తే, సామాన్యులకు ఏంలాభం కలుగుతుందో, గవర్నర్ కూడా ఆలోచించాలి.

జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉన్న కేసుల్లోఏ8, ఏ10గా ఉన్న ముద్దాయి ఎన్నికలకమిషనర్ గా ఏం న్యాయంచేస్తాడని ప్రశ్నిస్తున్నాను. గవర్నర్ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయన్ని హెచ్చరిస్తున్నాము. తప్పు చేయవద్దని, న్యాయానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగావ్యవహరించవద్దని గవర్నర్ని తెలుగుదేశంపార్టీ తరుపున హెచ్చరిస్తున్నా ము.

గవర్నర్ వెంటనే కళ్లు తెరిచి, ప్రభుత్వప్రతిపాదన పైఆలోచించాలని కోరుతున్నాము. తనతోటి ముద్దాయి లంతా తనచుట్టూఉండాలని కోరుకోవడం ముఖ్యమంత్రి కి ఉన్న చెడ్డఅలవాటు. వై.ఎస్ హాయాంలో గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన శ్రీమతి వై.శ్రీలక్ష్మి, ముఖ్య మంత్రితోపాటు, కోర్టుకు హాజరవుతున్నారు. ఆమెగురిం చి ముఖ్యమంత్రి ఎంతతాపత్రయపడ్డారండీ?

ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి రప్పించడంకోసం ఈ ముఖ్య మంత్రి ప్రధానిముందే సాగిలబడ్డాడు. ప్రధానితో ఏం చెప్పి, ముఖ్యమంత్రి శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకొచ్చాడో వైసీ పీనేతలెవరైనా చెప్పగలరా? పోలవరం, అమరావతి, ప్రత్యేకహోదా సహా వేటిగురించీ ప్రధానమంత్రిని అడగని, ముఖ్యమంత్రి , శ్రీలక్ష్మిని తనరాష్ట్రానికి రప్పించుకోవడా నికి నానాపాట్లు పడ్డాడు. తోటిముద్దాయి అనే కదా ముఖ్యమంత్రికి ఆమెపై అంతటి ఆపేక్ష. బీపీ.ఆచార్య, శామ్యూల్, వీ.డీ.రాజగోపాల్, మన్మోహన్ సింగ్, కృపానందం, రత్నప్రబ వంటి ఐఏఎస్అధికారులంతా, జగన్మోహన్ రెడ్డి అవినీతికి బలైపోయినవారు కాదా? వారంతా ఎక్కడైనా తనకుఎదురుపడితే సిగ్గుతో తలదిం చుకుంటారు.

జగన్ అవినీతి ఉబలాటానికి వారంతా బలిపశువులు అయ్యింది నిజంకాదా? అధికారులు పరంగా వారంతా ఉంటే, రాజకీయంగా విజయసాయి రెడ్డి మొదలు సజ్జల దివాకర్ రెడ్డి (సజ్జలరామకృష్ణారెడ్డి సోదరుడు). వై.వీ.సుబ్బారెడ్డి, వంటి అనేకమంది ఉన్నా రు. జగన్ తనఉబలాటాన్ని నిలువరించుకొని, రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికలకమిషనర్ గా నియమిం చాలి.

కనగరాజ్ కు అన్యాయం చేయడం, యావత్ దళి త జాతికి అన్యాయంచేయడమేనని ముఖ్యమంత్రి గ్రహిం చాలి. ఆనాడు కనగరాజ్ ను చంద్రబాబు నాయుడు వద్ద టున్నాడని మొసలికన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో తోటిముద్దాయిని కనగరాజ్ కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి ప్రయత్నించడ మేంటి? ప్రజలుకూడా ముఖ్యమంత్రి వ్యవహారశైలి గు రించి ఆలోచనచేయకపోతే ఎలా?
కనగరాజ్ ఎన్నికలకమిషనర్ గాఉంటే, చట్టాలను పటిష్టంగా అమలుచేస్తారని వైసీపీఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పినమాటల సంగతేమిటో, ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.

ఆనాడు కనగరాజ్ నియామకంలో చంద్రబాబుని నిలదీసిన అంబటి, నేడు ముఖ్యమంత్రి ని ఎందుకు నిలదీయడు? అంబటి నోరు పడిపోయిందా? ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి ఉద్దేశంప్రకారం ఎన్నికలకమిషనర్ గా కనగరాజ్ ను కదా నియమించా ల్సింది… మరి ఆస్థానంలో శామ్యూల్ ని ఎలా నియమి స్తారు? కనగరాజ్ చాలా గొప్పవ్యక్తని, న్యాయకోవిదుడని , చట్టాలనుసమర్థంగా నిర్వహిస్తాడని ఆనాడు ప్రభు త్వం చెప్పిన మాటలన్నీ ఉత్తివేనా? తాము, తమపార్టీ కనగరాజ్ నియామకాన్ని తప్పుపట్టలేదు.

రమేశ్ కుమార్ ను తనపదవిలో కొనసాగనివ్వాలని మాత్రమే డిమాండ్ చేశాము. ఇప్పుడు ఆయన పదవీకాలం ము గుస్తున్నందున, ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బం దులు లేనందున కనగరాజ్ ను నియమించాలంటు న్నాము. ఆనాడుకనగరాజ్ నియామకాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడని దుష్ప్రచారంచేశారు. ఇప్పుడు తామే కనగరాజ్ ను నియమించమంటున్నాము కదా? మరి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటి? అలీబాబా దొంగల ముఠాలాగా, ముఖ్యమంత్రి చుట్టూ అందరూ దొంగలే ఉండాలా? శ్రీలక్షి ఎవరు..ఆమె ఇక్కడికి ఎలావస్తారు? ఇప్పుడు ఈ శామ్యూల్ ఎవరు..అతనికి ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం…ఇద్దరూ ముద్దాయిలేకదా? చట్టానికి న్యాయానికి దొరక్కుండా ముఖ్యమంత్రి ఎలా అవినీతి చేయాలో శామ్యూల్ చెబుతాడని ఆయన్ని తెచ్చుకుం టున్నారా? ప్రభుత్వసలహాదారులు ఎవరు? ఎడిటర్ గా పనిచేసిన రామచంద్రమూర్తి ఎందుకు వెళ్లిపోయాడు? ఈ ముఖ్యమంత్రికి, తనకు పడదని ఆయన దండం పెట్టి వెళ్లిపోలేదా? ముఖ్యమంత్రి నియమించిన వారిలో చాలా మంది వెళ్లిపోయారు. ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న వారే ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు.

ప్రభుత్వం ఎన్నికలకమిషనర్ గా శామ్యూల్ వైపు మొగ్గుతోందనే కథనాలు పత్రికల్లో చూశాము. శామ్యూల్ లాంటివ్యక్తులు వ్యవస్థలను లీడ్ చేయడానికి ఉంటే, తమపార్టీ, తాము చూస్తూ ఊరుకోము. కనగ రాజ్ ప్రభుత్వానికి ఎందుకు నచ్చలేదో కూడా ముఖ్య మంత్రి సమాధానంచెప్పాలి. శామ్యూల్ నేరస్తుడు కాబట్టే, ముఖ్యమంత్రితో పాటు తిరుగుతాడనే వారిద్దరి సంబంధం అన్నదమ్ముల అనుబంధమైంది. శ్రీలక్షి జైలు కెళ్లొచ్చారు…. ఆమె ఎక్కడ కనిపించినా ముఖ్యమంత్రికి తన గతం గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డికి షర్మిలపై ప్రే మ ఉంటుందో లేదోగానీ, శ్రీలక్ష్మిని చూడగానే అవ్యాజ్య మైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆమె జగన్ తో పాటు జైల్లోఉండివచ్చింది కాబట్టి. నా తోటిముద్దాయిలు అందరూ కంఫర్టబుల్ గా ఉన్నారా అని ముఖ్యమంత్రి పదే పదే అడుగుతుంటారట. రేపు శామ్యూల్ ను ఎన్ని కల కమిషనర్ గా నియమించకుంటే, ముఖ్యమంత్రి చాలా బాధపడతారు. ఇటువంటి ముఖ్యమంత్రి తీరుపై రాష్ట్ర ప్రజలుఎందుకు ఆలోచించరని నేను ప్రశ్నిస్తు న్నాను. తనతోపాటుజైలుకొచ్చాడనో, తనతోపాటు దోపిడీకి సహకరించాడనో.. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ వ్యవస్థలకు ప్రతినిధులుగా నియమించడమేంటి?

గవర్నర్ ను అప్రమత్తంచేయడంకోస మే తాను, శామ్యూల్ గురించి చెబుతున్నాము. ఆయన శామ్యూల్ ని ఎన్నికలకమిషనర్ గానియమిస్తే, తాము అంతతేలిగ్గా దాన్ని వదిలిపెట్టము. దొంగలకు , దొరలకు సమానంగా ప్రాధాన్యతనిస్తే, దేశంలో వ్యవస్థల న్నీ కుప్పకూలుతాయని గవర్నర్ గ్రహించాలి. కనగరాజ్ కంటే శామ్యూల్ ఎలా బెటర్ పర్సనో ముఖ్యమంత్రి కచ్చితంగా సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *