Home Breaking ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెంపు ఓపెన్ స్కాం: సోమిరెడ్డి

ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెంపు ఓపెన్ స్కాం: సోమిరెడ్డి

391
0
(సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ  మాజీ మంత్రి)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై ఎస్  జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి..
మొన్న 14 డిస్టలరీల్లో ఉత్పత్తికి అనుమతించిన ప్రభుత్వం నిన్న 25 శాతం రేట్లు పెంచి మద్యం అమ్మకాలకు తెరలేపింది .మళ్ళీ ఇప్పుడు మరో 50 శాతం పెంపు అంటున్నారు..
మద్యం కోసం వేల మంది భౌతిక దూరం పాటించకుండా కిలోమీటర్ల కొద్ది బారులుదీరారు..పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది..
చివరకు కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లకు కూడా బ్రాందీ షాపుల వద్ద విధులు కేటాయించడం మీకే చెల్లింది..
కరోనా కట్టడికి భౌతిక దూరమే మార్గమని ప్రపంచం మొత్తం చెబుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం దానికి తూట్లు పొడిచే పరిస్థితి తెచ్చింది…
ప్రభుత్వ నిర్ణయాలు పేద ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి..
లాక్ డౌన్ కారణంగా ఇంట్లో బిడ్డల ఆకలి తీర్చలేని పరిస్థితిలో తల్లులుంటే భర్తలనేమో ఎర్రటెండలో బ్రాందీ షాపుల మందు ప్రభుత్వమే నిలబెట్టింది…అర్ధాకలితో గడుపుతున్న పేదల గొంతుల్లో ప్రమాదకరమైన మద్యం పోస్తారా…
కరోనా సాయం పేరుతో వెయ్యి రూపాయలు చేతికిచ్చి ఈ రోజు రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు మందు రూపంలో వారి దగ్గర వసూలు చేస్తున్నారు…
మద్యం కారణంగా నిన్న ఒక్క రోజే నా నియోజకవర్గం సర్వేపల్లిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు..
పొదలకూరు మండలం తాటిపర్తిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో కొట్టుకుని ఒకరు చనిపోయారు..
తోటపల్లి గూడూరు మండలం కోడూరులో హేమాద్రి అనే యువకుడు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు..
పొదలకూరు పట్టణంలో యాకసిరి పోలయ్య ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మద్యం కోసం ఎర్రటెండలో క్యూలో నిలబడి చనిపోయాడు..
మీ డిస్టలరీస్ లో ఎంత ప్రమాదకరమైన మద్యం ఉత్పత్తి చేస్తున్నారో మీకు అర్ధమవుతుందా…
మీరు అమ్ముతున్న మద్యాన్ని వారం రోజులు కంటిన్యూగా ఓ వ్యక్తి ఒక క్వార్టర్ చొప్పున తాగితే పక్షపాతం వస్తుంది..,రెండు క్వార్టర్ల లెక్కన తాగితో చచ్చిపోతారు..
2014 ఎన్నికల సమయంలోనే మీ ఎమ్మెల్యేలు కల్తీ మద్యం తెచ్చి పంచి పలువురి ప్రాణాలు బలితీసుకున్నారు..ఇప్పటికీ ఆ కేసులు జరుగుతున్నాయి..
మీ ప్రభుత్వం వచ్చాక అలాంటి కల్తీ మద్యాన్నే ప్రభుత్వ దుకాణాల్లో పెట్టి విక్రయిస్తున్నారు…
మీ డిస్టలరీస్ లో పది రూపాయలకు తయారయ్యే క్వార్టర్ ను 150కి అమ్ముతున్నారు..రూ.12 నుంచి రూ.14 లోపు తయారయ్యే మందును రూ.160 నుంచి రూ.200 వరకు అమ్ముకుంటున్నారు…
ప్రజలు రోజంతా చేసిన కాయకష్టాన్ని మద్యం రూపంలో మీరు దోచుకుంటున్నారు.ఎప్పుడూ ఎవరూ వినని బ్రాండ్లు తెచ్చారు…గతంలో ఉన్న కింగ్ ఫిషర్, నాకవుట్ వంటి బ్రాండ్లు ఏమైపోయాయో. బూమ్..బూమ్, కోలా, బ్లాక్ బస్టర్, గెలాక్సీ, 9 సీ హార్సెస్, 999 లెజెండ్, మంజీరా, రాయల్ గ్రీన్, యూత్ స్టార్…ఇవీ ఇప్పుడున్న బ్రాండ్లు…మీరు ఎన్నికల సమయంలో చెప్పిన నవరత్నాలు ఇవేనా..
ఈ పేర్లను ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పడైనా విన్నారా. మెక్ డోవెల్, ఓల్డ్ టావెర్న్, బ్యాగ్ పైపర్, ఆఫీసర్స్ చాయిస్ వంటి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ కంపెనీలు అడ్రస్ లేకుండా పోయాయి.
సింగరాయకొండలో మెక్ డోవెల్ కంపెనీ మూతేసేశారు….మా సర్వేపల్లిలో మాత్రం ఎస్.ఎన్.జే డిస్టలరీ బ్రహ్మాండంగా జరుగుతోంది. పాత కంపెనీలను పక్కన పెట్టేసి గ్రీన్ చాయిస్, రోల్ మోడల్ గోల్డ్ రమ్, రాయల్ ప్యాలెస్, కింగ్ లూయీస్ వంటి బ్రాండ్లను తయారు చేస్తున్నారు.
 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క షిప్ట్ మాత్రమే పనిచేస్తున్న ఎస్.ఎన్.జే కంపెనీ ఇప్పుడు మూడు షిప్టుల్లో పనిచేస్తోంది. చెత్తచెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు…ఎవరిచ్చారు మీకు ఈ అధికారం..
కేంద్ర ప్రభుత్వ అనుమతితో మద్యం అమ్మకాలు ప్రారంభించామని ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి సెలవిస్తున్నారు…కేంద్రం తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కూడా అనుమతిచ్చింది…వాళ్లు అమ్మకాలు ప్రారంభించలేదే. ఒక పద్ధతి, పాడు లేకుండా మీరు చేపట్టిన అమ్మకాలతో రెడ్ జోన్, కంటైన్మెంట్ ఏరియాల నుంచి గ్రీన్ జోన్లకు వచ్చి భౌతిక దూరం పాటించకుండా మందు కోసం ఎగబడ్డారు. ద్యం ధరలు పెంచితే పేదలు మందు తాగరని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది…నిన్న క్యూలలో నిలబడిన వారంతా పేదలు కాదా..వారిలో ఎవరైనా ధనవంతులు ఉన్నారా.
పొలాల్లోకి వెళితే లాఠీలతో కొట్టే పోలీసులు ఎక్కడెక్కడి నుంచో రెడ్ జోన్ల నుంచి వస్తున్న వారిని ఎందుకు ఆపడం లేదని మహిళలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది…
తమిళనాడు వాసులు కూడా మద్యం కోసం ఏపీపై ఎగబడే పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ నుంచి వలస కార్మికులను మాత్రమే ఏపీలోకి అనుమతిస్తాం. హైదరాబాద్ లో ఉన్న వారు కారుల్లో తమ కుటుంబసభ్యులు ముగ్గురు, నలుగురితో కూడా వచ్చేదానికి లేదని సీఎం చెబుతున్నారు…
ఇక్కడ మాత్రం మద్యం అమ్మకాల పేరుతో వేల మందిని క్యూలో నిలబెడతారు. కోట్ల మంది ప్రజలు క్యూలో నిలుచుంటారని స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్నే సుప్రీం కోర్టే సమర్ధించింది…
ఆ రోజు కోట్ల మందిని క్యూలో నిలుచోబెట్టి ఎలక్షన్ జరపాలనుకున్నారు…సుప్రీం కోర్టు తీర్పుతో అది సాధ్యం కాకపోవడంతో ఈ రోజు మద్యం అమ్మకాల ద్వారా కోట్ల మందిని రోడ్ల మీదకు తెచ్చి భౌతిక దూరం కూడా లేకుండా క్యూల్లో నిలబెట్టారు..
మీ లెఫ్ట్, రైట్లు, మీ ముందు, వెనక ఉండే వాళ్లు రాష్ట్రంలోని మెజార్టీ డిస్టలరీస్ ను గుప్పెట్లో పెట్టుకున్నారు…అనధికారికంగా మెజార్టీ షేర్లను బలవంతంగా లాక్కుని ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు…
ప్రాణాంతక మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల గొంతులో పోయడం దురదృష్టకరం. బ్రాండ్ల పేరు పెట్టి పిలిచే పరిస్థితి పోయి ధరల పేరుతో మందు అడిగే పరిస్థితులు తెచ్చారు. ఇదంతా భారీ కుంభకోణం..ఓపెన్ స్కాం. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఏపీలో ఉండవు….ఇక్కడ ఇష్టానుసారంగా కమీషన్లు వసూలు చేయడంతో ప్రముఖ కంపెనీలన్నీ వెళ్లిపోయాయి…
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఛీప్ లిక్కర్ తాగి అస్వస్థతకు గురైన వారే ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధమవుతుంది.లాక్ డౌన్ ఎత్తేవరకైనా మద్యం షాపులను మూసేయాలి..
కనీసం తెలంగాణలో విక్రయించే బ్రాండ్లను, పాత బ్రాండ్లను కూడా అందుబాటులో పెట్టండి…జనానికి ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు. మీ కలెక్షన్ కమీషన్లు, పర్సంటేజీల కోసం మంచి బ్రాండ్లను పక్కన పెట్టి కల్తీ మద్యం అమ్మే హక్కు మీకు లేదు. ప్రాణాంతకంగా మారిన బ్రాండ్లను వెంటనే ఉపసంహరించుకుని మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రాణాలు కాపాడండి…
నిన్న బ్రాందీ షాపులు తెరిచేందుకు మీ దగ్గర ఒక ప్లాన్, ఒక ప్రణాళిక లేదు…దీనిపై మేము ప్రశ్నిస్తే వాళ్లను కూడా చంద్రబాబు నాయుడు పంపించివుంటారని మాట్లాడే పరిస్థితిలో మీరున్నారు…
జనం ఆరోగ్యం, ప్రాణాలతో ఆటలాడుకునే కల్తీ మద్యం, ప్రమాదకరమైన లిక్కర్ ను వెంటనే ఆపండి.
(సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన అంశాలివి)