ఆంధ్రలో కొత్త రాజకీయ ప్రయోగం… వోటుకు తిరుపతి లడ్డు, వడ

ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్  కొత్త మలుపు తిరిగింది. ఓటకు నోటు విన్నాం, వోటు బిర్యానీ విన్నాం. వోటుకు ‘కోటర్’ విన్నాం, వోటుకు వంద నుంచి అయిదారువేల దాకా విన్నాం. అట్లాగే బోట్టు పెట్టి ఓటడగడం విన్నాం.

ఈ సారి 2021 పంచాయతీ ఎన్నికల్లో ఒక కొత్త అధ్యాయం మొదలయింది. ప్రజలంతా ఎంతో ఇష్ట పడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇచ్చి సెంటిమెంటు ఓటు అడగడం మొదలయింది.

వైసిపి నేతలు ప్రసాదం సంచి ఇవ్వడమే కాదు,  ప్రసాదంపై ఓట్ల ప్రమాణం కూడా చేయించుకుంటున్నారు. తిరుమల ప్రసాదాన్ని ఇలా ఓట్ల కోసం వాడాలన్నది ఎలెక్షన్ క్యాంపెయిన్ లో ‘ఇన్నొవేషన్’.

అయితే, తెలుగుదేశం పార్టీని దీనికి  అభ్యంతరం చెబుతూ ఉంది. దేవుడి ప్రసాదంతో ఓట్ల ప్రచారం చేయడం, ప్రసాదం సాక్షిగా ప్రమాణం చేయించుకోవడం అపవిత్ర కార్యక్రమం అని పార్టీ అధికార ప్రతినిధి డా. నాటుబాంబుల సుధాకర్ రెడ్డి అంటున్నారు. భక్తులకేమో లడ్లు దొరకవు,  ఓటు కోసం పంచడానికి వేలల్లో దొరకుతున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో ప్రసాదం స్వీకరించండి
ఓటును అందించండి, వైసిపిని ఆదరించండి అంటూ వైకాపా నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఆయన చెబుతున్న ఓటుకు తిరుపతి లడ్డు, వడ విశేషాలు:

ఓటర్లకు తిరుమల లడ్డు, వడ తో పాటు రూ. 3000 డబ్బు కూడా బహిరంగంగా పంచుతున్నారు.

తిరుమలలో భక్తులకు ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాదం లభించక భక్తులు అవస్థలు పడుతుంటే, ఓట్ల కోసం పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.

శ్రీవారి ప్రసాదంతో పాటు ఓటర్ స్లిప్పులు అందజేస్తూ దేవుడిపై ప్రమాణం చేయించు కుంటున్నారు

తొండవాడ గ్రామానికి చెందిన శ్రీవారి భక్తులు ఉమా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు

శ్రీవారి లడ్డూలు తొండవాడ పంచాయతీలో పంచుతున్నారని వారు తెలిపారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యాన్ లలో ప్రసాదం తరలిస్తున్నారు.

దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణం తగిన చర్యలు తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *