ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారో ప్రజలకు చెప్పాల్సిందే: టిడిపి

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పై ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాల ని తెలుగు దేశం నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర,  బొడే ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఈ చర్య వల్ల చార్జీల పెపుతో ఏటా 700 కోట్లు భారం పడుతోంద ని,5 ఏళ్లలో 3500కోట్లు ప్రజలపై భారంపడబోతోంద ని వారు అన్నారు.
జగన్ చేతగానితనం , అసమర్దత వల్లే బస్సు చార్జీల పెంపు వారు విమర్శించారు. ఇంకా వారేమన్నారంటే…
దేవినేని ఉామహేశ్వరరావు:
చార్జీల పెంపు వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతోంది
పేదవారిపై చార్జీల భారం వెంటనే ఉపసంహరించాలి
జగన్ చెతగానితనం వల్లే బస్సు చార్జీల పెంపు
సామాన్యుల నడ్డి విరిచారు. దీన్ని
ప్రజలు సహించరు
తెదేపా తరపున పోరాటం చేస్తాం
అమరావతి అంతా 144, రాష్ట్రమంతా సెక్షన్ 30అమల్లో ఉంది
ఇదేమి పరిపాలన, ఇదేమిరాజ్యం
రాష్ట్రంలో 144, 30 సెక్షన్లను ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పాలి
రేపట్నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
తెదేపా ప్రభుత్వంలో సామాన్యులపై ధరలు, చార్జీల భారం వేయలేదు
ఉల్లిపాయల కోసం రైతుబజార్ల వద్ద కిలో మీటర్ల మేర క్యూల్లో నిలబడి ప్రజలు కష్టాలు పడుతున్నారు
జగన్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగాయి
నిత్యావసరధరలు సహా బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలి
రాష్ట్రంలో లిక్కర్ , బెట్టింగ్, శాండ్ మాఫియా యథేచ్చగా నడుస్తోంది
రాష్ట్రంలో లక్ష బెల్టు షాపులు నడుస్తున్నాయి.
బయటినుంచి లిక్కర్ ను తెచ్చి వైకాపా కార్యకర్తలు, నేతలు లిక్కర్, సారాను ను ఏరులై ప్రవహింపజేస్తున్నారు
ఏ జిల్లాల్లోనూ ఎస్పీలు 6నెలలకు మించి పనిచేసే పరిస్థికి లేదు
కొల్లు రవీంద్ర :
సామాన్యుడు బతకలేని విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
గుద్దుడే. . గుద్దుడే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్వారు
ఇసుక ధరలు పెంచారు. . ఇప్పుడు బస్సు చార్జీలు పెంచారు. . రేపు కరెంటు చార్జీలు పెంచుతారు
ఉల్లిపాయ ధర వింటేనే కళ్ల వెంట వీళ్లు వచ్చే పరిస్థితి ఉంది
రైతుబజార్లో సామాన్యులు కు ప్రభుత్వం సరిపడా ఉల్లిపాయలు అందిచలేకపోతున్నారు
రైతుబజార్లలో ఉల్లి గడ్డల కోసం తొక్కిస లాడే పరిస్థితి నెలకొంది
సామాన్యులపై భారంపడకుండా ఆర్టీసీ ని విలీనం చేయండి
ఇది. . దోపిడీప్రభుత్వం. . దొంగల ప్రభుత్వం
దోచుకోవడమే ధ్వేయంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది
చార్జీల పెంపుపై ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
బోడె ప్రసాద్ , తెదేపా మాజీ ఎమ్మెల్యే:
ఎమ్మెల్యేలు, మంత్రులను అచ్చోసిన ఆంబోతుల్లాసీఎం జగన్ గ్రామాలపై వదిలారు
మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు
గ్రామాల్లో రోడ్లపై ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం