షర్మిలను కలసిన తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభన్

 

కాంగ్రెస్  అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల  పార్టీకి  రాజీనామా చేసి తొందర్లో పార్టీ పెట్టపోతున్నవైఎస్ కూతురు షర్మిల కు మద్దతు పలికారు.

ఈ  రోజు షర్మిలను కలసి ఆమెకు మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం తన  నైజమని, కాంగ్రెస్ లో ఉంటే అది సాధ్య పడనందన పార్టీని వదిలేస్తున్నట్లు ఆమె అనంతరం విలేకరులకు చెప్పారు.

కాంగ్రెస్ లో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్ల, ఉత్తమ్ తీసుకున్న నిర్ణయాలు వల్ల తాను  బయటకు రావాలసి వచ్చిందని శోభన్ చెప్పారు.

‘రాజన్న సంక్షేమ పథకాల  వల్ల వైఎస్  పాలన స్వర్ణ యుగంలాగా ఉండింది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాన్ని  ప్రస్తుత ప్రభుత్వం నీరు గార్చుతోంది. అందువల్ల మళ్లీ రాజన్న రాజ్యం స్థాపించేందుకు ముందుకు వస్తున్న షర్మిలకు మహిళలంతా మద్దతు పలుకాలి,’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారిందని  ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఆమె విమర్శించారు.

మతం, కులాల ద్వారా  సర్జికల్ స్ట్రైక్ అంటూ బీజేపీ ప్రజల్లి వెళ్లాలనుకుంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.    కేంద్రం అండ లేకుండా ఇక్కడ కేసీఆర్ ఆటలు కొనసాగవని అంటూ  రెండు పార్టీలకు ఒప్పందం ఉందపి ఆమె అన్నారు.

’ప్రజా సమస్యలపై అన్ని పార్టీలు గాలికి వదిలేసాయి కాబట్టి మరో పార్టు అనివార్యం అయింది. తెలంగాణ హక్కుల కోసమే తన ప్రథమ పోరాటం అని షర్మిల చెప్పారు.  నా బాట కూడా అదే కావడంతో షర్మిల తో కలవడానికి వచ్చాను.పని చేసినపుడు పదవి అడగడంలో తప్పులేదు.. అందుకే సీటు ఆశించాను,’ అని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *