నా లెక్కలు తప్పని తేలిస్తే గొంతు కోసుకుంటా: దాసోజు సవాల్

హైదరాబాద్ ఫిబ్రవరి 27: నిన్న గన్ పార్క్ వద్ద తాను మాట్లాడిన మాటలు తప్పని నిరూపిస్తే అక్కడే గొంతుకోసుకొని ప్రాణాలు అర్పిస్తానని దాసోజు శ్రవణ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

తెరాస ప్రభుత్వం అబద్దాలతో కాలం వెళ్లదీస్తూ కాంగ్రెస్ పై అసత్య ప్రచారానికి పాల్పడుతోందని  నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశం లో కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడుతూ  ఏఐసీసీ అధికార ప్రతినిధి దుయ్యబట్టారు.

కాంగ్రెస్ కేవలం పదివేల ఉద్యోగాలే భర్తీచేసిందనడం తప్పని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మూడున్నర సంవత్సరాల కాలంలోనే 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీచేశారని గుర్తుచేశారు. అవి కూడా ఖాళీలు మాత్రమే భర్తీ చేయకుండా 84 వేల కొత్త ఉద్యోగాలు సృష్టిచారని తెలిపారు.మహాత్మా గాంధీ,తెలంగాణా,శాతవాహన యూనివర్సిటీ ల ద్వారా కాకుండా బాసర ట్రిపుల్ ఐ టి ల్లో వేల ఉద్యోగాలు సృష్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాం లోనే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ను నెలకొల్పి ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించారని నాడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న నేటి ప్రధాని మోడీ ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపి అధ్యయనం చేసి తమ రాష్ట్రం లో ప్రవేశ పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేడు అమలు చేస్తుందని తెలిపారు.

నేడు ఉద్యోగాలు కల్పించకుండా ఏ మొఖం పెట్టుకొని పట్టభద్రులను ఓట్లు అడుగుతారని ఒక్కో ఓటుకు ఐదు వెలవరకు ఇవ్వడానికి వెనకాడడం లేదని ఆ డబ్బంతా కాళేశ్వరం,మిషన్ భగీరథ లాంటి పనుల్లో కాముషన్లే అని ఎద్దేవా చేసారు.

బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రం లో 1.92 ఖాళీలు ఉన్నాయని కాంట్రాక్టు పోస్టులు 1.20 కాగా నూతన జిల్లా ల ఏర్పాటు వల్ల అవసరమయ్యే ఉద్యోగాలు కలిపి మొత్తం నాలుగు లక్షల ఖాళీలు ఉన్నాయని గుర్తు చేసారు.ఈ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలని లేకుంటే మీ భరతం పడతామని ఎన్ ఎస్ యూ ఐ నేతృత్వం లో రోడ్డుపైకి వచ్చి మెం ఉద్యమాలు చేస్తామని ఉద్యోగాల భర్తీకి ముల్లుకట్టే పట్టుకొని మిమ్మల్ని వెంబడిస్తామని హెచ్చరించారు.

చిల్లరరౌడీ లను, ఆకురౌడీ లను వెంటపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఫార్మాసిటీ పేరుతొ భూములు తీసుకొని వ్యాపారం చేస్తున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు.గ్రేటర్ లో ఎన్నికలు అయిపోగానే వరదబాధితులకు సాయం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని నిరుద్యోగులను రైతులను మోసం చేస్తూ కేవలం మీ కుటుంబం బాగుంటే సరిపోతుందనట్టు మీ ప్రవర్తన మారకుంటే భరతం పడతామని హెచ్చరించారు.

తాను MA,MBA, PHD పూర్తిచేసి ప్రొఫసర్ గా పని చేశానని ఓ పేరున్న ఐ టి కంపెనీలో జీఎం గా పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉండేవాడినని తెలంగాణ రాష్ట్ర సిద్ధికోసం తెలంగాణ ప్రజలకోసం లక్షల్లో జీతాలను వదిలి ఉద్యమం లో పాల్గొంక్డానికి రాజాజీయాల్లోకి వచ్చానని తెలిపారు.

సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని.. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పోరాడానని శ్రవణ్ పేర్కొన్నారు….

2009లో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్లినప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో తాను కుటుంబ సభ్యుడినని.. వాళ్లింట్లో సొంత తమ్ముడిని చూసుకున్నట్లు చూశారని ఆయన వెల్లడించారు….

అయినప్పటికీ వాళ్లు తెలంగాణకు వ్యతిరేకం అన్నప్పుడు.. వారిని తిరస్కరించి రోడ్ల మీదకు వచ్చానని శ్రవణ్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు చంద్రబాబు సంక నాకుతూ తిరిగి, ఉద్యమానికి వెన్నెపోటు పొడిచే ప్రయత్నం చేశావంటూ తలసానిపై మండిపడ్డారు….

మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడితే తాము గొట్టం గాళ్లమా? అని ఫైర్ అయ్యారు. సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారని… చివరకు తేలు కుట్టిన దొంగలా పారిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన పేరును తోక ముడిచిన తారక రామారావు అని మార్చుకోవాలని అన్నారు. ఆకు రౌడీ అయిన ఆలుగడ్డల శ్రీనివాస్ తో తనను కేటీఆర్ తిట్టించారని… ఇది సరికాదని చెప్పారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తలసాని ఒక రాజకీయ భిక్షగాడు అని శ్రవణ్ దుయ్యబట్టారు. చెంచాగిరి చేసే తలసానికి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఈ గొట్టంగాని కోసమే 2009లో నా ఇంటికి వచ్చావ్ కేటీఆర్ అని మండిపడ్డారు. తనను బతిమాలి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు.

పదో తరగతి ఫెయిల్ అయినోడివి.. నీకు నిరుద్యోగుల బాధ ఎట్లా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నువ్వు…టీఆర్‌ఎస్‌కి చెంచావి. పైసలిచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన నువ్వా.. నన్ను గొట్టం గాడు అనేది..? నీ లెక్క పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమకారుల పార్టీలో తలసాని లాంటి లఫంగిలు చేరారు. నేను గొట్టంగాన్నో.. కాదో కేసీఆర్‌ని అడుగు’’ అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు కోసం నాడు తెరాస నుండి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ప్రో జయశంకర్ గారితో , విద్యాసాగర్ గారితో కలిసి రాయడంలో జరిగింది , అలాగే నాడు తెరాస పొలిట్ బ్యూరో మెంబెర్ గా ఉన్నాను, 2014 సంవత్సరంలో కెసిఆర్ గారి తో 4గంటల పాటు టీవీ చర్చా కార్యక్రమంలో మానిఫెస్టో పై చర్చలో పాల్గొని చర్చించడం జరిగింది, ఆలుగడ్డల శ్రీనివాస్ నేను గొట్టంగాన్నో.. సీఎం కేసీఆర్‌ని అడుగు

చివరికి ఉద్యమకారులపై దాడులు చేసే ప్రయత్నం చేసిన ఆకురౌడీవని, నువ్వు ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడటమేంటీ అంటూ శ్రవణ్ ఫైరయ్యారు. కావాలంటే మోండా మార్కెట్‌లో ఆలుగడ్డల గురించిమాట్లాడుకోవచ్చంటూ ఆయన సెటైర్లు వేశారు. …

తలలేని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆకురౌడీ, చిల్లర రౌడీ పది ఫెయిలయిన శ్రీనివాస్ యాదవ్ గతం లో కెసిఆర్ ముక్కు కోస్తా అన్నమాటలు మరిచిపోయారా అని మిమ్ములను మీ ఇంటి సభ్యులను తిట్టిపోసిన శిఖండి లాంటి తలసాని ని నాపై ఉసికొల్పితే భయపడే వారెవరూలేరని శ్రవణ్ అన్నారు.

ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని దీనిపై చర్చకు ప్రగతి భవన్,  తెలంగాణ భవన్ లకు ఎక్కడికి రమ్మన్నా వస్తామని ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఉన్నపలంగా రావడానికి సిద్దమని కానీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు.

తెలంగాణా తమ జాగీరు కాదని కొట్లాడితెచ్చుకున్న తెలంగాణ అని మిమ్మలిని ఇంతటితో వదిలిపెట్టమని మీ ముఖ్యమంత్రి 2013 లో పార్లమెంటులో ప్రకటించిన విధంగా బలిదానం కాబడ్డ 1200 మంది తెలంగాణ బిడ్డల కుటుంబాలకు వెంటనే పదిలక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేసారు.

తెరాస ,బీజేపీ పార్టీల పంచాయితీల నడుమ ఐ టి ఆర్ లను సర్వనాశనం చేసారని దాసోజు అన్నారు.2004 లో ఉన్న ఐ టి ఉద్యోగాలు ఎన్ని మీరు అధికారం లోకి వచ్చిన తరువాత 2014 లో ఉన్న ఐ టి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో తెలపాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.ఇది పెన్షన్ల, రైతుబంధుల ప్రభుత్వమేనని నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారని ఇది బాధ్యతలేని ప్రభుత్వం అని పెద్దమనిషి తరహాలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలని దాసోజు కోరారు.

తెలంగాణ సమాజం గొంతు వినాలని లేకుంటే తాము ఊరుకునే ప్రసక్తే లేదని మీ అందరి భరతం పడతామని ఉద్యోగాల కల్పన అయ్యేవరకు తాము మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *