నష్టాల్లో స్విగ్గీ, జొమాటో

గత ఏడాది ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) బాగా విస్తరించింది. 2020 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ  నెట్ వర్క్ లోకి లక్ష రెస్టరాంట్లు వచ్చి చేరాయి. స్వీగ్ డెలివరీ సిబ్బంది సంఖ్య  రెండు లక్షలకు చేరింది. స్విగ్గీ సర్వీసులు మరొక   406 వూర్లకు విస్తరించాయి. యాప్ లో టు టియిర్, త్రి టియర్ అంటేచిన్న చిన్న పట్టాణాలు కూడా వచ్చి చేరాయి. బయటినుంచి పెట్టుబడులు కూడా బాగా వచ్చాయి. దీనితో స్విగ్గీ రెవిన్యూ   127 శాతం పెరిగింది. కాని, అదే సమయంలో స్విగ్గీ నష్టాలు కూడా బాగా పెరిగాయి. స్విగ్గీ విడుదల చేసిన లెక్కల ప్రకారం నష్టాలు 65 పెరిగాయి. స్వీగ్గీ  వోనర్  బండిల్ టెక్నాలజీస్ 2020 వార్షికాదాయం  127.8 శాతం పెరిగినట్లు ప్రకటించింది. ఇదే కాలంలో నష్టాలు రు. 3,920.4 కోట్లకు చేరాయి. 2019లో స్వీగ్గీ నష్టాలు రు. 2,363.6 కోట్లు మాత్రమే. స్విగ్గీ ఖర్చులు రు. 3,659.1 కోట్ల నుంచి రు. 6,864.1 కోట్లకు చేరాయి.

స్విగ్గీ కరోనా పాండెమిక్ టైంలో బాగా దెబ్బ తినింది. అయితే, 2020 అక్టోబర్ నుంచి తేరుకోవడం మొదలయింది. కరోనా పూర్వపు స్థితిలో 80 నుంచి 85 దాకా చేరింది. డిసెంబర్ కేంద్ర ప్రభుత్వం పథకం PM SVANidhi  లో భాగస్వామి అయింది. దీనితో టు టియర్, త్రీ టియర్ (2-Tier, 3-Tier cities) పట్టణాలో ఉండే బాగా పేరున్న 36 వేల స్ట్రీడ్ ఫుడ్ వెండర్స్ తన నెట్ వర్క్ లోకి తీసుకుంది.

ఇదే కాలంలో ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ ప్రత్యర్థి జొమాటో (Zomato) కూడా నష్టాల్లోకి జారుకుంది. 2019తో పోలిస్తే జొమాటో నష్టాలు  160.6 శాతం పెరిగి  రు.2451 కోట్లకు చేరాయి. అయితే, ఇదే వ్యాపారం వృద్ధి అయి, రెవిన్యూ కూడా బాగా పెరిగింది. రెవిన్యూ 98 శాతం పెరిగి రు.2,485 కోట్లకు చేరింది. 2019లో ఇది కేవలం 1,255 కోట్లు  మాత్రమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *