FLASH… FLASH… జగన్ లేఖని ఖండించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ మీద తీవ్రమయిన ఆరోపణలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది.
ఈ సాయంకాలం సమావేశమయిన అసోయేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి ధోరణిని ఖండించింది. ఒక తీర్మానం చేసింది. దీని మీద ఈ రాత్రికి ఒక సమగ్ర ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
 జగన్మోొహన్ రెడ్డి  న్యాయవ్యవస్థను దెబ్బతీసేవిధంగాను, న్యాయవ్యవస్థ పనితీరును పక్కదారి పట్టించే విధంగానూ లేఖ రాశారని, ఇది అభ్యంతరమని కార్యవర్గం తీర్మానం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

*జగన్ కు వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేఖ
*జగన్ రాసిన లేఖ పై సుప్రీమ్ కోర్టు బార్ ప్రకటన కొద్ది సేపట్లో…
కార్యవర్గం ఉపాధ్యక్షుడు కైలాస్ వాసుదేవ్ అధ్యక్షతన సమావేశమయింది.  21 మంది సభ్యులున్న కార్యవర్గంలో 20 మంది సమావేశానికి హాజరయ్యారు. అధ్యక్షుడు హాజరకాలేదుగాని, తాను కార్యవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని  తెలిపినట్లు  ఒక ప్రతినిధి ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు చెప్పారు..
మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో జగన్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన మొదలయింది. ఇలా న్యాయవాదులంతా తీర్మానం చేయడం ఇది మూడో సంఘటన. మొదట ఢిల్లీ భార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేసింది. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చాలా తీవ్రమయిన పదజాలాంతో జగన్ లేఖకు అభ్యంతరం చెబుతూ ఖండించింది. ఇపుడు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తోడయింది.