మళ్ళీ రైళ్ల రద్దు, పెరగని ప్రయాణికుల సంఖ్య

 దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తూ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను మళ్లీ రద్దు చేసింది.కనీసం పది రాష్ట్రాలలలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా  పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట  కంటే వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనితో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూ ఉంది. దసరా, దీపావళి పండుగలలో ప్రయాణికుల రష్ పెరుగుతుందని  క్రమక్రమంగా రైల్వేశాఖ సర్వీసులను పెంచినా కూడా ఆదరణ లభించడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే గురువారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాగా, కరోనాకు ముందు ఈ రైళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణించారు.
రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…
విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం
నాందేడ్- పాన్వెల్- నాందేడ్
ధర్మాబాద్‌- మన్మాడ్- ధర్మాబాద్
తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి
కాచిగూడ- నార్కేర్- కాచిగూడ
కాచిగూడ- అకోలా-కాచిగూడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *