సియాచిన్ గ్లేసియర్ లో విషాదం, ఆరుగురు భారతీయులు మృతి

హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో హిమపాతం తాకిడికి ఆరుగురు భారతీయులు చనిపోయారు.
ఇందులో నలురుగు సైనికులుున్నారు.మిగతా ఇద్దరు వారికి సహరిస్తున్న సివిలియన్ కూలీలు.
ఈ ప్రమాదం సోమవారం నాడు సముద్రమట్టానికి 19,000 అడుగుల ఎత్తున జరిగింది. మొత్తం ఎనిమిది మంది మంచు చరియలు కూలిపోవడంతో అందులో చిక్కుకు పోయారు.అయితే, వెంటనే సమీపంలోని ఇతర పోస్టులసైనికులు అక్కడికి వచ్చి వారందరిని బయటకు లాగారు.
కాని వీరిలో ఆరుగురు హైపో ధర్మియా (hypothermia) వల్ల చనిపోయారు. హైపోధర్మియా అంటే మనిషి శరీర ఉష్ణోగ్రత బాగా పడిపోవడం. మనిషి శరీర ఉష్నోగ్రత 98.4 డిగ్రీల పారిన్ హీట్. ఇది 95కంటే పడిపోయినపుడు హైపో థర్మియా అంటారు.
నిజానికి అనారోగ్యంతో ఉన్న మరొక తోటి సైనికుడిని రక్షించేందుకు వీరంతా వెళ్తున్నారు. ఈ దారిలో మధ్యా హ్నం 3.30 ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకున్నారు.
ఇలాంటి దుర్ఘటనే 2016లొ జరిగింది. అపుడు మద్రాసు రెజిమెంట్ కు చెందిన పది మంది సైనికులు చనిపోయారు. ఇందులో 9 మంది అక్కడిక్కడే చనిపోతే, పదో వ్యక్తి లాన్స్ నాయక్ హనుమంతప్ప ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 60 సెంటిగ్రేడ్ కు పడిపోతూ ఉంటుంది. అయినప్పటికి సుమారు 3 వేల మందిసైనికులు రేయింబగులు ఈ ప్రాంత సరిహద్దును కాపాడుతూ ఉంటారు.