జయరాం హత్యకేసులో సంచలన విషయాలు వెల్లడించిన శ్రిఖా చౌదరి

కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసునును పోలీసులు దాదాపు ఛేదించినట్లు తెలుస్తోంది. జయరాం హత్యకేసుకు మూల సూత్రధారి ఆయన మేనకోడలు శ్రిఖా చౌదరి అని భావించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. కాగా హత్య చేసింది ఆమె ప్రియుడు రాకేష్ అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో పోలీసులకు పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించినట్టు సమాచారం. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

శ్రిఖా చౌదరికి జయరాంకి వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. మా మావయ్య మంచివాడు కాదు. మా చెల్లిని కూడా మావయ్య లైంగికంగా వేధించేవాడు. అంతేకాదు రెండవ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రాకేష్ తో డేటింగ్ చేసినట్టు కూడా ఆమె పేర్కొంది. రాకేష్ ని మావయ్యకు పరిచయం చేసింది నేనేనని ఆమె వెల్లడించింది. తాను రాకేష్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న విషయం జయరాంకి చెప్పినట్లు తెలిపింది. అయితే రాకేష్ ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన జయరాం రాకేష్ తో గొడవ పడినట్టు పేర్కొంది.

మా మేనత్త మావయ్యకి చెక్ పవర్ లేకుండా చేయడంతో మావయ్య తన ఖర్చుల కోసం చాలా అప్పులు చేసేవాడని తెలిపింది. అయితే రాకేష్ రెడ్డి నాలుగున్నర కోట్లు జయరాంకి ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపిన ఆమె రాకేష్ అంత ఆస్తిపరుడు కాదని చెప్పింది. కాగా రాకేష్ వ్యాపార వేత్తలకు, సినీ పరిశ్రమ వారికి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించేవాడని తెలియజేసింది పోలీసులకు. అలాగే మావయ్య జయరాంకి కూడా రాకేష్ డబ్బులు ఇప్పించాడు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో మావయ్యకి రాకేష్ కి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే రాకేష్ మావయ్యని చంపుతాడని ఎప్పుడూ ఊహించలేదని శ్రిఖా వెల్లడించింది.

జయరాం చనిపోయిన రోజు శ్రిఖా శ్రీకాంత్ అనే వ్యక్తితో లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్టు తెలిపింది. మావయ్య యాక్సిడెంట్ లో చనిపోయినట్టు మా అమ్మ సుశీల నాకు ఫోన్ లో తెలిపారు. అప్పుడు మావయ్య హత్య చేయబడ్డాడు అని నాకు తెలియదు అని శ్రిఖా పోలీసుల విచారణలో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *