శాంతం… శాంతం (కవిత)

-డాక్టర్ ఎస్.జతిన్ కుమార్

నేను నిన్న చూసాను

తదాగతుని చిరునవ్వుల  సంకేతం

రాగా విరాగాల కతీతం

ప్రవక్త ప్రవచనంలా వెలుగొందుతున్న వదనం 

వేదన నుండి విముక్తం

యాతన యాత్రకు పరిసమాప్తం

అది తరలిపోయిన నాన్న ముఖం 

నాన్న ఇక చెరిగిపోని జ్ఞాపకం

మిగిలింది పరమ ప్రశాంతం

ఇక అంతా శాంతం …శాంతం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *