జూన్ 14నుంచి శబరిమల దర్శనాలు, పంపానదీ స్నానం నిషేధం

లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో కేరళలోని శబరిమల ఆలయాన్నిజూన్ 14 తేదీనుంచి తెరవాలని నిర్ణయించారు. మిధునం పూజలకోసం భక్తులను గుడిలోకి అనుమతించాలని కేరళ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు.
అయితే భక్తులు సందర్శనకు ఆన్ లైన్ ద్వారా అనుమతి తీసుకోవలసి వుంటుంది. జూన్ 14 న మిధునం పూజ, పండగ ప్రాంరభమవుతుంది. ఈ ఉత్సవాలు జూన్ 28 దాకా కొనసాగుతాయి. హారతి జూన్ 28న జరుగుతుంది.
వర్చువల్ క్యూ ద్వారా గంటకు 200 మంది భక్తులను మాత్రం అనుమతిస్తారు. దర్శనం రెండు విడతలుగా సాగుతుందని మొదటి విడత తెల్లవారుజామున 4 నుమచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, రెండో విడత మధ్యాహ్నం నాలుగు నుంచి రాత్రి పదకొండు దాకా కొనసాగుతుంది. మొత్తం ఈ పదహారు గంటల కాలంలో 3,200 మంది భక్తులకు స్వామిని దర్శించుకుంటారు.
దర్శనాకి వచ్చ వారిలో ఒక్కొక్క సారి 50 మందిని మాత్రం ఆలయం లోపలికి అనుమతిస్తారు. మిగతా వారు , లోనికి వెళ్లిన భక్తులు వచ్చే దాకా బయట ప్రత్యేకంగ సోషల్ డిస్టెన్స్ కోసం గీచని వలయాలలో నిలబడుకుని ఉండాలి. పది సంవత్సారల లోపు 65 సంవత్సరాల పైబడిన వారిని దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతించరు.
శబరిమల కు వచ్చే భక్తులెవరూ పంపా నదిలో స్నానమాచరించేందుకు వీల్లేదు. ఇది నిషేధం. అదే విధంగా భక్తుల ఆహారం, వసతి ఏర్పాట్లు చేయడం లేదని మంత్రి తెలిపారు.  ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ జాగ్రత్త  సైట్ https://covid19jagratha.kerala.nic.in/home/ నుంచి పాస్ తీసుకోవలసి ఉంటుంది.
ఇదే విధంగా కేరళలోని మరొక ప్రముఖ ఆలయం గురువాయూర్ గుడిలోకి భక్తులను అనుమతిస్తున్నారు. కాకపోతే, గురువాయూర్ దర్శనాలు మంగళవారం నుంచి మొదలవుతాయి. ఈ రోజు ఉదయం నుంచి దర్శనానికి అన్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా మొదలయింది. రిజిస్ట్రేషన్ https://guruvayurdevaswom.in/#/login సైట్ కు వెళ్లి చేసుకోవచ్చు.

గురువాయూర్ గుడిలో గంటకు కేవలం 150 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు.అంటే రోజుకు ఆరువందల మందికి మించి దర్శనం ఉండదు. గంటలో ఒక్కొక్క బృందంలో 50 మంచి చొప్పున మూడు బృందాలను దర్శనానికి అనుమతిస్తారు. అయితే, శబరిమల లోగాని, గురువాయూర్ లోగాని విఐపి దర్శనాల్లేవు.
గురువాయూర్ ఆలయంలో వివాహాలను కూడా అనుమతిస్తున్నారు. ఇవి జూన్ నాలుగో తేదీనుంచే ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1.30 దాకా రోజూ 60 వివాహాలు జరుగుతాయి.అన్ రిజస్ట్రేషన్ సమయంలో వివాహం టైమ్ అలాట్ చేస్తారు. ప్రతిపెళ్లికి కేవలం 10 మందిని మాత్రమే అనుమతిస్తారు. దేవస్వం ఎదరుగా ఉన్న పుస్తకాల షాపులో కూడా వివాహం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.