సమ్మె విరమిస్తాం, షరతుల్లేకుండా విధులకు ఆహ్వానించాలి : ఆర్టీసీ జేఏసీ

  హై కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సమ్మె వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వథామ రెడ్డి ప్రకగటించారు. అయితే, కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధలకు ఆహ్వానించాలని ఆయన షరతు పెట్టారు. ఈ మేరకు ఆర్టీసి జెెఎసి నేతులు సంతకంలో ఒక  ప్రకటన విడదుల చేశారు.
‘హైకోర్టు తీర్పు కాపీ ఈ రోజు మాకు అందింది. దాని పై చర్చించాం.  హైకోర్టు లేబర్ కోర్ట్ కు ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం.ఈ రోజు హైకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నాం.. ప్రభుత్వం కూడా తీర్పు ను గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. కార్మికుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వం పై ఉంది.ఎలాంటి షరతులు లేకుండా కార్మికుల ను విధుల్లోకి తీసుకోవాలి.షరతులు లేని విదులకు ఆహ్వానించాలని కోరుతున్నాం. ప్రభుత్వం షరతులు లేకుండా విదులకు ఆహ్వానిస్తే సమ్మె విరమించడానికి సిద్దంగా ఉన్నాం. షరతులు లేని చేరికలు మా ప్రధాన డిమాండ్. సమస్యలను లేబర్ కోర్ట్ పరిష్కరిస్తుందనే నమ్మకం ఉంది. సమ్మె కాలానికి జీతాల విషయాన్ని లేబర్ కోర్ట్ లో లేవనెత్తుతాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచన రాలేదు. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాం. డ్యూటీ చార్ట్ ,అటెండెంట్ రిజిస్టర్ పై మాత్రమే సంతకం పెడతాం,’ అని ఆయన చెప్పారు.
ప్రకటన కాపీ