Home Breaking వైఎస్ ఆర్ కార్యదర్శి ఎంజివికె భాను షర్మిల పార్టీలోకి వస్తున్నారా?

వైఎస్ ఆర్ కార్యదర్శి ఎంజివికె భాను షర్మిల పార్టీలోకి వస్తున్నారా?

138
0

 

మొత్తానికి వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో కదలిక తీసుకు వస్తూ ఉంది. పార్టీ ఇంకా పెట్టక ముందే విఐపిలు కలుస్తూనే ఉన్నారు. ఆమె ఇంకా పార్టీ పేరు ప్రకటించాల్సి ఉంది. పార్టీలక్ష్యం ప్రకటించాల్సిది.పేరులోనే లక్ష్యం వ్యక్తమవుతుందని కొందరు చెబుతున్నారు. పేరులో తెలంగాణ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు రెండు ఉంటాయని అంటున్నారు. అయితే, పేరులో కాంగ్రెస్ అనేమాట ఉండదని ఒక అభిమాని చెప్పాడు. అయితే, దీనికి సంబంధించి షర్మిల్ సర్కిల్ నుంచి సంకేతాలు అందడం లేదు. తెలంగాణలో ఒక విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ ఆర్ అభిమానులు కాంగ్రెస్ లోఉండలేక, టిఆర్ ఎస్ లో చేరలేక,మరొక పార్టీలోకి వెళ్లలేక తొలినాళ్లలో ఇబ్బంది పట్టారు. తర్వాత జగన్, కెసిఆర్ దోస్తీ చూశాక, ఆయన అభిమానులు కెసిఆర్ వైపు మొగ్గు చూపారు. దీనితో కెసిఆర్ తిరుపతి వెళ్లినపుడు ఘన స్వాగతం ఇచ్చారు. ఇది వైఎస్ ఆర్ అభిమానులు ఇష్టమున్నాలేకున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ క సానుకూల వైఖరి తీసుకున్నారు. ఇపుడు వాళ్లంతా షర్మిల వైఫు వస్తారని ఆశపడుతున్నారు. అయితే, షర్మిల పార్టీ ఒక స్వరూపం తీసుకుంటే విఐపీలే కాకుండా కిందిస్తాయిలో ఉండే వైఎస్ ఆర్ అభిమానులు, మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, పార్టీలో చేరేందుకు ముందుకువస్తారు. ఇది సృష్టించే సందడిని బట్టి ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చే అవకాశం ఉంది. షర్మిలనిజంగానే ఏప్రిల్ 9న ఖమ్మంలో పార్టీ పేరు ప్రకటిస్తే రాష్ట్రంలో కలకలం మొదలవుతుందని అంటున్నారు.

ఈ లోపు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఎంజివికె భాను (IAS 1985 Assam-Meghalaya) కూడా షర్మిల పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఆయన అస్సాం క్యాడర్ఐఎఎస్ అధికారి. ఒక టర్మ్ పనిచేసిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. 2018జూలైలో రిటైర్ అయ్యారు. తర్వాత అస్సాం వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ తేజ్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2019లో పోటీ చేశారు. ఆయన టీ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. అపుడ టీ కార్మికుల సంక్షేమానికి బాగా పనిచేశారని పేరుంది. నిజానికి అక్కడి టీతోటల్లో70,000 మంది తెలుగు కార్మికులున్నారు. వారి వోట్లతో ఆయన గెలుస్తాడని అనుకున్నారు. అది జరగలేదు.బిజెపి ఆయన మీద తీవ్రంగా దాడి చేసింది.ఆయన అస్సామీ భాషే రాదని, ఇంపోర్టెడ్ చేప అని విరుచుకుపడింది. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వ్యక్తి అస్సాం ప్రజలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని విమర్శించారు. అయినా సరే, ఎన్నికల్లో ఆయన 38 శాతం ఓట్ల వచ్చాయి. బిజెపి అభ్యర్థి పల్లబ్ లోచన్ దాస్ గెలిచినా భాను క్యాంపెయిన్ బాగా పనిచేసింది.

2004లో ఆంధ్రప్రదేశ్ రాకముందు అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి బాగా సన్నిహితుడిగా ఉండేవారు. గోగోయ్ తీసుకున్న కీలకమయిన నిర్ణయల వెనక భాను ఉన్నాడని చెబుతారు. తర్వాత ఆయన డిప్యుటేషన్ మీద ఆంధ్రా వచ్చి వైఎస్ఆర్ ముఖ్యకార్యదర్శి అయ్యారు. ఆయన కీలక పాత్ర వహించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దగ్గిర పనిచేసిన అనుభవంతో ఉన్న భాను పార్టీలో చేరి షర్మిల కు సలహాదారుగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది.

ఉమ్మడి ఆంధ్రాకు వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు డిజిపిగా పని చేసిన స్వరణ్ జీత్ సింగ్ సేన్ నిన్న షర్మిలని కలసిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీలోకి చేరేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది వైఎస్ ఆర్ కు సన్నిహితంగా ఉండిన రిటైర్డు అధికారులు పార్టీలో చేరే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here