ఢిల్లీ రైతులతో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు… గ్యాలరీ

ఢిల్లీ-హర్యానా సరిహద్దున రెన్నెళ్లుగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన కార్మిక, కర్షక సంఘాల ప్రతినిధులు  సంఘీభావం తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రతినిధులున్నారు.  అక్కడి రైతులు ఏర్పాటు చేసిన గుడారాలలో తెలుగు ప్రతినిధులకు బస ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్దతు పట్ల ఢిల్లీ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

తొంభై రోజులుగా ఢిల్లీ కేంద్రంగా సాగే సమరశీల రైతాంగ ప్రతిఘటనకు అండగా దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నో బృందాలు ఇప్పటి వరకూ ఢిల్లీ పర్యటనలు చేశాయి. అనేక వివరాల్ని అవి లోకానికి వెల్లడించాయి. ఇప్పుడు వాటి కొనసాగింపుగా కర్ణాటక కామ్రేడ్స్ చొరవతో ఒక సౌత్ ఇండియా బృందం సంఘీభావ పర్యటనకు పూనుకుంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, AP లకు చెందిన వివిధ ప్రజా సంఘాల తలపున ఏర్పడ్డ ఈ ఉమ్మడి దక్షిణాది సంఘీభావ బృందంలో 130 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో మహిళలు కూడా గణనీయంగా వున్నారు. ఈ బృందంలో రైతు, కూలి, కార్మిక, మహిళ, విద్యార్థి, యువజన, సాంస్కృతిక తదితర రంగాల ప్రాతినిధ్యం వుంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ బృందం పర్యటన ఈ రోజు 23-2-2021 టెక్రి బోర్డర్ కి చేరింది.

ఫిబ్రవరి 23 నుండి 27 వరకు ఢిల్లీ చుట్టూ హైవేల ముట్టడి ప్రాంతాల్ని ఈ బృందం క్రింది విధంగా సందర్శిస్తుంది.

23-టెక్రీ బోర్డర్
24-సింఘ బోర్డర్
25-షాజహనాపూర్ బోర్డర్
26-ఘజీపూర్ బోర్డర్
27-తిరిగి సింఘు బోర్డర్

అక్కడి ఫోటోలు ఇవి:

27-2-2021 రాత్రి తిరుగు ప్రయాణాలు ఉంటాయి. ఈ బృందంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, AP రాష్ట్రాల నుంచి రైతు, కూలి, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన, సాంస్కృతిక రంగాలకు చెందిన వివిధ ప్రజా సంస్థలు, సంఘాల ప్రతినిధులు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *