‘టైగర్’ నరేంద్ర గుర్తున్నారా? ఏప్రిల్ 9 న ఆయన వర్ధంతి

టైగర్ నరేంద్ర (ఏలే నరేంద్ర 1946ఆగస్టు 21- 2014 ఏప్రిల్ 9)  తెలంగాణలో మరుగున పడిన నాయకుల్లో ఒకరు. టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తో ఆయనకు విబేధాలు రావడం,టిఆర్ ఎస్ నుంచి ఆయనను సస్పెండ్ చేయడంతో తెలంగాణ నిర్మాతల్లో ఆయన చోటు దక్కలేదు.

టైగర్ నరేంద్ర ఒక విలక్షణమయిన నాయకుడు. ఎంపి అయ్యాక కూడా హైదరాబాద్ వోల్డ్ సిటి వదలని ఎకైక నాయకుడు ఆయనే. ఎంపి అయినా, కొద్దిరోజులు కేంద్ర మంత్రి అయినా ఆయన ఓల్డ్ సిటి మొఘల్ పురా వదల్లేదు. కమ్యూనిల్ గా చాలా సెన్సిటివ్ బస్తీ అయినా ఆయన దాని వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఎంఐఎం తో ఆయన కు ఎపుడూ కోల్డ్ వార్ సాగుతూనేవచ్చింది. వాళ్ల పెట్టనికోటలో కూడా ఆయన ధైర్యంగా నివసించారు.

మతఘర్షణలు జరిగినపుడల్లా ఆయనను అరెస్టు చేసే వారు. ‘నేను ఈ ప్రాంతం వదిలేసి హైదరాబాద్ బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్ కో వెళ్లిపోతే ఇక్కడ ఉన్న నా మద్దతుకు దారులేమయిపోతారు. వాళ్లేమనుకుంటారు,’ అనే వాడు.

ఏలే నరేంద్ర బిసి లలో పద్మశాలి వర్గానికి చెందిన నాయకుడు. నరేంద్ర భారతీయ జనతాపార్టీలో అంతకు ముందు ఆర్ ఎస్ ఎస్ లో చాలా అంకిత భావంతో పనిచేశారు.

1999లో తొలిసారి ఎంపి అయ్యారు. అపుడు ఎన్డియే ప్రభుత్వం ఏర్పడినపుడు తనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. రాలేదు.దీనితో ఆయన నిరుత్సాహం చెందారు. తెలంగాణ విషయంలో కూడా పార్టీతో ఆయనకు విబేధాలొచ్చాయి. అపుడు తెలంగా సాధన సమిటి(TSS) ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కృషి మొదలుపెట్టారు. తర్వాత 2002లో ఆయన తన పార్టీని టిఆర్ ఎస్ లో విలీనం చేశారు.

నరేంద్ర అలా బిజెపినుంచి దూరంగా జరగడంత్ ఓల్డ్ సిటిలో పార్టీ బాగా బలహీనపడింది. అప్పటినుంచి ఇప్పటి దాకా ఓల్డ్ సిటిలో ఇంత ప్రాబల్యం ఉన్న నాయకుడు రాలేదు. దీనివల్లే ఆయనకు టైగర్ నరేంద్ర అనే పేరు వచ్చింది. ఓల్డ్ సిటి నుంచికేంద్ర మంత్రి నుంచి తొలి నాయకుడు కూడాఆయనే.

మొదక్ ఎంపిగా ఆయన రెండు సార్లు గెలిచారు. తెలంగాణ వ్యవహారాంలోనే బిజెపితో విభేధించారు. టిఆర్ ఎస్ లో చేరాకనెంబర్ టూ అయ్యారు. టిఆర్ ఎస్ తరఫున మెదక్ నుంచి రెండో సారి గెలుపొంది గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అయ్యారు.

విదేశాలకు మనుషుల అక్రమరవాణా ఆరోపణలతో టిఆర్ ఎస్ ఆయనను 2007లో సస్పెండ్ చేశాక , కొద్దిరోజులు కాంగ్రెస్ తో ఉన్నా తరువాత మళ్లీ 2011లో బిజెపిలోకి వచ్చారు.

భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుండి తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం ఆయన చాలా కృషి చేశారు. 1983 నుంచి 1994 దాకా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయయ్యారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో విన్పించారు .పూర్వపు మెదక్ ప్రస్తుత జహీరాబాద్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ తరపున గెలుపొంది ఈ ప్రాంత అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు.

2014 ఏప్రిల్ 9 న ఆయన హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *