రాజమండ్రి-కోవూరు మధ్య ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతానికి 120 యేళ్లు

ఈ ఫోటోలో ఉన్న బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్ లో తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలనుకలుపుతూ గోదావరి నది మీద నిర్మించిన బ్రిడ్జి. ఇదొక  అపురూపమైన జ్ఞాపకం.
సరిగ్గా ఈ రోజుకి 120 సంవత్సరాల కిందట అంటే ఆగస్టు 30,1900 నాటికి పూర్తయి, ప్రారంభమయిన బ్రిడ్జి.
సుమారు ఒక శతబ్దాం ఈ దేశానికి సేవలందించిన ఈ వంతెనను  1997లోొ డికమిషన్ చేశారు. దీనినిపుడు నేషనల్ మాన్యుమెంట్ గా ప్రకటించారు. దీనిని సుందరీకరించి, టూరిస్టు స్పాట్ గా చేసేందుకు రాజమండ్రి మునిసిపాలిటీ  ముందుకు వచ్చింది.
దేశంలోని ఒక కీలకమయిన రైలు మార్గం (కలకత్తా-చెన్నై)లో కీలకమయిన వంతెన ఇది.
రాజమండ్రి- కొవ్వూరు పట్టణాల మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జిని  హేవ్ లాక్ బ్రిడ్జ్. ఆరోజుల్లో మద్రాసు ప్రెశిడెన్సీ గవర్నర్ గా ఉన్న సర్ అర్థర్ ఎలిబ్యాంక్ హావెలాక్ (Sir Arthur Elibank Havelock)పేరే దీనికి పెట్టారు.
 ఇపుడు గొదావరి మీద మరొక వంతెన నిర్మించడంతో ఈ ‘వోల్డ్ బ్రిడ్జి’ అయిపోయి నిరుపయోగంగా, గతానికి నిచ్చెన నిలబడి ఉంది.
ఈ వంతెనను టూరిస్టు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు రైల్వే శాఖ ముందుకురావాలని 2010 ఏప్రిల్ 22 రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ లో క్ సభలో కూడా ఒక ప్రశ్న వేశారు.
Today, the First Godavari Bridge still stands as a monument of human endeavor and skill. The bridge spans a length of 2.74 Kms. Since the bridge has been abandoned, it has been decided by the Government of Andhra Pradesh to explore the possibility of converting the same as Tourism Spot on a Build, Operate and Transfer basis in Public-Private partnership mode through the Tourism Department for which, the Ministry of Railways consented to hand over the bridge to the Tourism Department along with the surrounding properties belonging to Railways towards Rajahmundry and Kovvur. But, no concrete action has been initiated on this issue అని అరుణ్ కుమార్  విచారం వ్యక్తం చేస్తూ I urge upon the Government to enter into a Memorandum of Understanding with the Department of Tourism, Government of Andhra Pradesh and hand over the bridge to them for development of the area as a tourist place అని విజ్ఞప్తి చేశారు.
ఈ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు.
2012 లో ఈ వంతెన చెత్తకింద అమ్మెసేందుకు రైల్వే శాఖ ప్రతిపాదించింది. అయితే, తెలుగు వారి నుంచి ముఖ్యంగా కోస్తాంధ్రకు చెందిన రాజకీయనాయకుులు,ప్రజలు, మేధావులనుంచి విమర్శలురావడంతో రైల్వేశాఖ ఈ ప్రయత్నం మానుకుంది.
 రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్రిడ్జి బ్రిటిష్ సేనల తరలింపునకు చాలా దోహదపడింది. ఢకా, బర్మా ఇండోనేషియాలో బ్రిటిష్ సేనలను మద్రాసు, బొంబాయిల నుంచి తరలించేందుకు ఈ బ్రిడ్జి బాగాఉపయోగపడింది.
ఈ వంతెన విశేషాలు:
శంకు స్థాపన: 11-11-1897
తొలి రైలు ప్రయాణం: 6-8-1900
ప్రారంభించినది: మద్రాసు గవర్నర్ సర్ అర్థర్ ఎలిబ్యాంక్ హేవ్ లాక్. అందుకే బ్రిడ్జికి కూడా ఆయన పేరే పెట్టారు.
తొలి రైలు: హౌరా మెయిల్
వర్క్ ఇంజనీర్: ఎఫ్.టి.జి. వాల్టన్
విస్తీర్ణం: 23 వేల చ.అ
బ్రిడ్జి నిర్మాణానికి అంచనా: రూ.50,40,457
వ్యయం: రూ.46,89,849
మిగులు : రూ.3,56,698
బ్రిడ్జి పొడవు: 3480  మీటర్లు, 11,420 అడుగులు
స్థంభాలు: 56