జూన్ ఒకటి నుంచి 200 రెగ్యులర్ రైళ్లు మొదలు

రైల్వే శాఖ జూన్ 1 నుంచి రెగ్యులర్ రైళ్లు నడపాలనుకుంటున్నది. ప్రజలెవరైనా ఈ సర్వీసులను వాడుకోవచ్చు నని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేవారు.

 

 

టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవలసి వుంటుంది.‘ స్టేషన్ల దగ్గిర టికెట్ లు విక్రయించరు. అందువల్ల ప్రయాణికులు టికెట్లను కొనేందుకు రైల్వేస్టేషన్ల బుకింగ్ కౌంటర్ల దగ్గరకు పరిగెత్తాల్సిన పనిలేదు. ఈ 200 నాన్ ఎసి రైళ్లు అన్ని ప్రధాన రూట్లలో నడుపుతారు, అని రైల్వే అధికారులుచెప్పారు. ఇవన్నీ సెకండ్ క్లాస్ నాన్ ఎసి బోగీలుండే రైళ్లే.
అయితే, రైళ్లు పూర్తి స్థాయిలో నడిచే దాకా వలస కూలీలను రవాణా చేస్తున్న శ్రామిక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తూనే ఉంటాయి.
ఇపుడు రైల్వే శాఖ 200 శ్రామిక్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుడూ ఉంది. అవసరమయితే ముందు ముందు ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తామని పీయూష్ గోయల్ చెప్పారు. మే 12 నుంచి మొదలయిన 15 రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు యధావిధిగా నడుస్తూ ఉంటాయి.
ఇపుడు పునరుద్ధరించాలనుకుంటున్న 200 రైళ్ల వివరాలను రేపోమాపో ప్రకటిస్తారు.
కోవిడ్ లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు మార్చి 24న రైల్వే శాఖ అన్ని రైళ్లను నిలిపివేసింది. ఇలా సుమారు 13500 రైళ్లు ఆగిపోయాయి. జూన్ 30 దాకా రైళ్లకోసం బుక్ చేసిన టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే, నిత్యావసర వస్తువుల సరఫరా రైళ్లను, ఎమర్జన్సీ సర్వీసులను మాత్రం నడుపుతూ వచ్చారు. మే 1 నుంచి వలస కూలీలను వారి వారి ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లను నడుపుతున్నారు.