285 సం. తర్వాత బంద్ అవుతున్న పూరీ జగన్నాథ రథయాత్ర

కోవిడ్ విస్తరిస్తున్ననేపథ్యంలో ఒడిషా పూరీ జగన్నాధుడి రథయాత్రను నిన్న సుప్రీంకోర్టు నిషేధించింది. పూరీ రథయాత్ర ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ఎపుడో 17వ శతాబ్దంలో కొన్ని సార్లు తప్ప 12 వ శతాబ్దం నుంచి ఇక్కడ రథయాత్ర నిరంతరాయంగా కొనసాగుతూవస్తున్నదని చెబుతారు.
ఇటీవలి కాలంలో రథయాత్ర ఎపుడూ ఆగిపోలేదు. ఇపుడు కరోనా రథయాత్ర అపేసే పరిస్థితులు సృష్టించింది. 285 సంవత్సరాల కింద దాడుల కారణంగా రథయాత్ర నిర్వహించలేకపోయారు. 1733 , 1735 సంవత్సరాలలో ఒడిషా డిప్యూటీ గవర్నర్ గా ఉన్ మహమ్మద్ తఖీ ఖాన్ జగన్నాథాలయం మీద దాడి చేశాడు. అపుడు దేవతల విగ్రహాలను గంజామ్ జిల్లాకు మార్చారు.
ఇపుడు రథయాత్రకు జగన్నాథుడు,భలభద్రుడు, సుభద్ర రథాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురవారంనాడు రథయాత్ర రద్దుచేయాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి నగరంలో నిరనమొదలయింది. ఈ రోజు బంద్ కూడా పాటిస్తున్నారు.
రథయాత్రకు సంబంధించి ఒదిషా వికాస పరిషత్ వేసిన పిటిషన్  మీద విచారణ జరుగుతున్నపుడు రథయాత్ర వంటి ధార్మిక సంబంధ కార్యక్రమాలను అనుమతించాలని కేంద్రం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు.
అయితే, రథయాత్రకు ఒరిస్సా ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఒరిస్సా ప్రభుత్వం తరఫున వాదించిన హరీష్ సాల్వే ‘కరోనా వంటి విపత్తుల సమయంలో మనం మత విశ్వాసాలకుఅతీతంగా ఉండాలి,’ అని చెప్పడంతో  ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం  కోర్టు దృఢంగా రథయాత్ర రద్దు చేయాలని చెప్పింది.” ఇలాంటి పరిస్థితులలో ఆలయ కార్యక్రమాలను కొనసాగిస్తే జగన్నాధుడు మమ్మల్ని క్షమించడు. అందుకే రథయాత్ర ను రద్దు చేస్తున్నాం,’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి

పూరి జగన్నాధ ఆలయానికి కొత్త సమస్య, అధికారుల్లో ఆందోళన

 

పూరీ రథయాత్రలో పది నుంచి పన్నెండు లక్షల మంది గుమికూడతారని, ఇది పది, పన్నెండు రోజులు జరుగుతున్న విషయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Like this story? Share it witha friend!

ఈ నెల 23 నుంచి రథయాత్ర ఉత్సవాలు మొదలుకావలసి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవం ఇదే. అంతేకాదు, అతిపురాతనమయిన సంప్రదాయం కూడా. ఆలయం నుంచి విగ్రహాలను వెలుపలికి తెచ్చి ఉరేగింపుగా తీసుకువెళ్లే సంప్రదాయం ఉన్న ఎకైక గుడి ఇదే. ఇక జగన్నాధుడు, బలభద్రుడు, సుబద్ర లకోసం మూడు ప్రత్యేక రథాలు తయారువుతాయి.42 రోజులు కష్టపడి 18  చక్రాలున్న ఈ రథాను  4000 వేల కొయ్యముక్కలతో తయారు చేస్తారు. ఈ రథాలను చేసే బాధత్య ఒకే కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తూన్నది. రథయాత్ర ను అక్కడ గుండిచ యాత్ర (Gundicha Yatra) అనిపిలుస్తారు.
దేవస్నాన పూర్ణిమ  తర్వాత జగన్నాధుడికి జ్వరం వస్తుంది. జ్యేష్ఠమాసం పూర్ణిమ  నాడు జగన్నాధ దేవుడికి చేయించే స్నానం ఇది.

ఈ జర్వం  15 రోజలు పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భగవంతుడికి ఛక్తబోగో( గోదుమలు, మొలకలు, పనసం, మామడి పండ్ల తో వండినది), మోదక్ నైవేద్యంగా పెడతారు. జ్వరం నుంచి కోలుకున్నాక, తన అత్త గారింటికి వెళ్లాలనుకునుకుంటారు. ఇలా ఆయన ఆలయం నుంచి బయటకురావాలనుకుని, అక్కడి నుంచి నడచుకుంటూ మరొక చోటకు వెళ్లాలనుకోవడమే ఈ రథయాత్రకు దారితీసింది.
అయితే, దీనికి జగన్నాథ గుడి పూజారుల సంఘం చత్తీస నిజోగ్ (Chattisa Nijog) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సుప్రీంక్టు నిర్ణయం మీద సమీక్షక పిటిషన్ వేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ గుడి పరిపాలన గురించి సుప్రీంకోర్టు కు సరిగ్గా వివరించనందున కోర్టు రథయాత్రను రద్దు చేయాలని నిర్ణయించిందని సంఘం అభిప్రాయపడింది. ‘కోవిడ్ ను దృష్టిలో పెట్టకునే దేవతల రథయాలను తయారుచేయడం ప్రారంభించారు. రథాల తయారీలో పాల్గొనే పూజారులకు, వండ్రంగులకు కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకసూత్రాల ప్రకారమే రథయాత్రను నిర్వహించేందుకు గుడి పాలనా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది,’ పూజారుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక సారి రథయాత్రను నిర్వహిస్తే, ఆలయంలో రథ యాత్ర ఆధారం చేసుకుని నిర్వహించే ఇతర కార్యక్రమాలన్నింటిని అంతరాయం కలుగుతుందని ఈసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కావలంటే రథయాత్ర రోజున ప్రజలెవరూ గుడికూడా కుండా కర్ఫ్యూ విధించవచ్చని కూడా ఈ సంఘం ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఈరోజ శ్రీ జగన్నాథ సేన పూరీ బంద్ కు పిలుపునిచ్చింది.
మత విశ్వాసాల వ్యవహారల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరసనగా బంద్ పాటిస్తున్నామది, బంద్ ను శాంతియుంగా పాటించాలని, రథయాత్ర రద్దులో రాష్ట్ర ప్రభుత్వం కుట్రకూడా ఉందని సేన కన్వీనర్ ప్రియదర్శన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ విషయాలు చర్చించేందుకు ఈ రోజు ఆలయ పూజారులు పూరీ శంకరాచార్యను కలిసే అవకాశం ఉంది.
Puri Shankaracharya (credits: Kalingatv)
 సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వ విధానం ఆహ్వానించదగ్గవే నని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అయితే, ఈ రోజు ప్రత్యామ్నాయ ఉత్సవ కార్యక్రమాల గురించి పూరిజగన్నాథ ఆయన పాలకమండలితో చర్చించడం జరగుతుందని సామీజీ వెల్లడించారని కళింగ టివి రాసింది.