Home Breaking అచ్చన్న అరెస్టు మీద ప్రొద్దుటూరులో టిడిపి నిరసన

అచ్చన్న అరెస్టు మీద ప్రొద్దుటూరులో టిడిపి నిరసన

69
0
టిడిపి సీనియర్ నాయకుడు టిడిపి శాసనసభాపక్ష ఉపనేత ప్రముఖ మాజీ మంత్రి  కింజరపు అచ్చెం నాయుడు  అక్రమ అరెస్ట్ ను ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఖండించింది.
ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ లో మైదుకూరు రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి,వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ప్రవీణ్ కుమార్ రెడ్డి ట్రెండింగ్ తెలుగు న్యూస్ తో మాట్లాడుతూ  అచ్చన్నాయుడు అరెస్టు రాజకీయ కక్ష సాధింపు అని వర్ణించారు.ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ అణచేయలేరని ప్రవీణ్ అన్నారు.
 డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి తో పాటు ఈకార్యక్రమంలో  ట్టణఅధ్యక్షుడు, ఇ. వి సుధాకర్ రెడ్డి, బి.సి సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు, ముస్లిం మైనారిటీ వై.ఎస్ మహ్మద్ , షేర్ అలీ, ఖాజా, సిద్దయ్య,నల్లపోతులనాగరాజు, జిలాని, సుబ్బారావుయాదవ్, బొమ్మిరెడ్డి ప్రసాద్, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.