తెలంగాణలో ఈరోజు 71 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో ఈ రోజు  71 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని  ఆరోగ్య శాఖ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి మీద ఆరోగ్యశాఖ ఒక బులెటీన్ విడుదలచేసింది.
 ఈరోజుతో  తెలంగాణ లో కరోనా కేసులు 2000 సమీపిస్తున్నాయి.  ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు అయ్యాయి.  ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి చెందారు. దీనితో   ఇప్పటి వరకు మృతుల సంఖ్య 57కి చేరింది.
ఇక అసుపత్రిలో చికిత్స తీసుకు 120 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడించారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుంచి  1284 మంది డిశ్చార్జి అయ్యారు.  తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులున్నాయి.
ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38 కనిపించాయి. 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళవని,  విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ గుర్తించారని అధికారులు చెప్పారు.
రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,- సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదయ్యాయి.