ఈ తరం చూడని పెన్నా ప్రవాహం అది…

నివార్ తుఫాన్ తెచ్చిన వర్షాల వల్ల పెన్నానదికి వరదలొచ్చాయి. పెన్నా ఉపనదులన్నీ పొంగి పారడంతో పెన్నా  నెల్లూరు జిల్లాలోపరవళ్లు తొక్కింది. అది అసాధారణమయిన ప్రవాహమని, ఇది ఈ తరానికి తెలియన పెన్నా వరద అని రాష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ పెన్నానది వరద ప్రాంతాన్ని పరిశీలించారు.
నెల్లూరు చరిత్రలోనే ఇంత వరద పెన్నా నదికి లేదని ఆయనఅన్నారు.
పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు కూడా పెన్నాలో కలవడం వలనే పెన్నా మహోగ్రరూపం దాల్చిందని ఆయన అన్నారు.
జిల్లాలో పెన్నానదిపై 50 కి.మీ వద్ద సంగం ఆనకట్ట, 81 కి.మీ వద్ద నెల్లూరు ఆనకట్ట ఉన్నాయి. అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాలను తాకుతూ పెన్నా ఉధృతంగా ప్రవహించింది.
కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని  మంత్రి అధికారులకుసూచించారు.
డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలిస్తానని గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.
మంత్రిరాకతో తరలివచ్చిన అప్పారావుపాలెం గ్రామ ప్రజలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *