పోతిరెడ్డిపాడు పనులు మొదలైతే కెసిఆర్ రాజీనామా చేయాలి : ఉత్తమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది మీద నిర్మించతలపెట్టిన పోతిరెడ్డి పాడు  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టు నిర్మాణం పనులు మొదలైన రోజు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి  సీఎం కెసిఆర్ రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ రోజు ఈ ప్రాజ్టకు నిర్మాణానికి వ్యతిరేకంగా గాంధీ భవన్ లో జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసమర్థత,  చేతగాని తనం వల్ల నే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శిొచారు.
ఉతమ్ ఇంకా ఏమన్నారంటే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందునుంచి ఈ ప్రాజక్టుల గురించి  మాట్లాడుతున్నడు …కానీ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు.
కేసీఆర్ తోనే మాట్లాడినంకనే పోతిరెడ్డిపాడు పై జీవో ఇచ్చినం అని AP మంత్రులు చెబుతున్నారు…
గతంలో పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకెళ్లినప్పుడే మేము ఆందోళన చేసినం.
ప్రస్తుతం ఉన్న ENC మురళీధర్ రావు 2011 లోనే రిటైర్మెంట్ అయ్యారు
కానీ ఇంకా కొనసాగుతున్నాడు.
ఈయన ప్రస్తుతం కాంట్రక్టు ENC గా కొనసాగుతున్నాడు.
వేల కోట్ల టెండర్ల లో ఈయన ఎలా పాల్గొంటాడు.
పాలమూరు ప్రాజెక్టు లో 2 TMC లనుంచి ఒక్క TMC కి ఎలా తగ్గిస్తాడు..
మురళీధర్ రావు ఎవరు అసలు?
ఎవరబ్బ సొమ్మని నీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవరిస్తున్నావు.
మురళీధర్ రావు పై చర్య తీసుకోవాలి.
లేదంటే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే మురళీధర్ రావు పని చేస్తున్నాడని అనుకోవలసి వస్తుంది
గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే తమ్మిడి హెట్టి ని వదిలిపెట్టి కమీషన్ ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కడుతున్నారు.
లాక్ డౌన్ టైం లో 21 వేల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తారు?
ముఖ్యమంత్రి ఇందులో 8% పర్సెంట్ కోసం ఈ టెండర్లు పిలిచాడు..
2 టిఎంసి ల కోసం ప్రజల పన్నుల సొమ్మును లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాడు
పోతిరెడ్డిపాడు పై ఎలాంటి పోరాటంకైనా మేము సిద్ధం
‘చలో పోతిరెడ్డిపాడు’ కు కూడా పిలువునిస్తమ్..
పోతిరెడ్డిపాడు పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ప్రధాని ని కూడా కలుస్తాం
పోతిరెడ్డిపాడు తెలంగాణ జీవన్మరణ సమస్య.