Home Breaking పర్లే, ఎక్కడికెళ్లినా, రాజధాని మళ్లీ అమరావతికే వస్తుంది : పవన్

పర్లే, ఎక్కడికెళ్లినా, రాజధాని మళ్లీ అమరావతికే వస్తుంది : పవన్

125
0
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.  ఈ రోజు పార్టీ సమావేశం తర్వాత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లులు పెట్టి రాజధాని మార్పు చేయాలనుకున్నా అది తాత్కాలికం మాత్రమే అని అన్నారు. తిరిగి తిరిగి రాజధాని ఇక్కడి కే వస్తుందని ఆయన ఈ ప్రాంతంలో  సేవ్ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న రైతులకు హామీ ఇచ్చారు.

అమరావతి అనేది ఇక్కడే ఉండాలి.. ఇదే నా ధ్యేయం. కూల్చివేతతో మొదలు పెట్టిన వారు కూల్చివేత తోనే అంతం‌ అవుతారు. మీకు మాటిస్తున్నా.. అమరావతి ఇక్కడే ఉండేలా.. ఆంధ్రుల రాజధానిగా బిజెపి, జనసేన కలిసి పని‌ చేస్తాం . నన్ను ఏమైనా తిట్టుకోండి.. వైసిపి నేతల భాష, మాట కు బదులు ఇస్తాం .కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ అమరావతి ని కూడా ఎవరూ కదల్చకుండా చేస్తా.

‘రెండేళ్ళ లో‌మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ ఇక్కడే అమరావతి శాశ్వత రాజధాని‌ చేస్తాం. నేను విభేదం కలిగించే రాజకీయాలు చేయను, మనశ్శాంతి రాజకీయం‌ చేస్తా. మోడీ నా పై ఉన్న నమ్మకం తో ఆరోజు పిలిచి పొత్తు పెట్టుకున్నారు. రాజధాని ఎక్కడకి వెళ్లినా అమరావతి కే వస్తుంది. నేను రోజూ ఏం చేయడం లేదని ఆవేదన‌ చెందవద్దు.మీకు అంతిమంగా మంచి ఫలితం‌ వచ్చి తీరుతుంది, అని పవన్ వ్యాఖ్యానించారు.
‘అమరావతియే  శాశ్వత రాజధాని. ఇక్కడే ఉంటుంది. ఈ ప్రాంత  రైతులు 33 వేల ఎకరాలు భూమిఇవ్వడంతో అమరావతి రాజధాని నిర్మాణం మొదలయింది. ప్రధాని స్వయంగా వచ్చి శంకుస్థాపన  చేశారు.  ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. అయితే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తున్నది. అమరావతి ఇష్టం లేకపోతే, ప్రతిపక్ష పార్టీ లో ఉన్నపుడు ఎందుకు జగన్   భూ సమీకరణను అడ్డుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రేమతో రాజధానిని విశాఖకు తరలించడం లేదని గుర్తుంచుకోవాలి. అక్కడి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వికేంద్రీకరణ అని  రాజధానిని మూడు ముక్కలు చేసి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఆయన విశాఖకు తీసుకువెళ్తున్నారు.  విశాఖపట్నం మీద నిజంగా ఆయనకు  అంత ప్రేమ ఉంటే తిత్లి తుఫాన్ వచ్చినపుడు విశాఖ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు, ’అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
రాజధాని మార్పునకు కేంద్రం వప్పుకుందని ముఖ్యమంత్రి అస్యత్య ప్రచారాలు చేస్తున్నాడని పవన్ విమర్శించారు.
ఢిల్లీలో  కనిపించినపుడు నమస్కారంపెట్టడమే అంగీకారం ఎలా అవుతుందని ఆయన చెప్పారు.
‘అయిదు కోట్ల మంది ప్రజలు అంగీకారంతోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విడగొడుతున్నారు. రాష్ట్రాన్ని విచ్చిన్నం చేస్తున్నారు . అయితే, ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు జనసేన బలంగా నిలబడుతుంద,’ని ఆయన ప్రకటించారు.
పోలీసులను దాటుకుని వెళ్లొచ్చు తాము అసెంబ్లీ ని చుట్టుముట్టేందుకు ముందుకు వెళ్ళి ఉండవచ్చు. . వారి విధులకు ఆటంకం కలిగించవద్దనే ఆగామని చెబుతూ అమరావతి రాజధానిగా ఉంటుందని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది. ఇది ఖాయమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
పవన్ ఇంకా ఏమన్నారంటే…
రేపు ఢిల్లీ పర్యటన కు‌ వెళుతున్నా.కేంద్రం నుంచి నాకు పిలుపు వచ్చింది. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే నేను కేంద్రం ను కోరేది. ఇక్కడ పరిస్థితి, మీ బాధలు వివరిస్తా. సచివాలయ ఉద్యోగులు కూడా బాధ ను చెప్పుకోలేక పోతున్నారు. వారు కూడా బయటకు వచ్చి ఉద్యమం చేయాలి. రాజకీయ నాయకులు, అధికారం శాశ్వతం కాదు. ఉద్యోగులు శాశ్వతం.. మీరు‌ పోరాటం చేయండి. జనసేన పార్టీ ఎలా ఉన్నా..‌ భవిష్యత్తు ఏమైనా.జగన్ ఇష్టం వచ్చినట్లు మారిస్తే.. ఆ చట్టాలు మనం ధర్మబద్ధంగా మార్చలేమా