పరిస్థితేం బాలేదు, జనాలు కార్లు టూవీలర్లు కొనడం మానేస్తున్నారు

 ఒక వైపు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశాబావం వ్యక్తం చేస్తుంటే మరొక వైపు ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం కొనసాగుతూ ఉంది.  దేశంలో అన్ని రకాల ప్యాసెంబర్ వాహనాల కొనుగోళ్లు డిసెంబర్ లో బాగా పడిపోయాయి. సొసైటీ అప్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ( ఎస్ ఐ ఎ ఎమ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం డొమెస్టిక్ కార్లు అమ్మకాలు 8.4 శాతం పడిపోయాయి. డిసెంబర్ 2018లో 1,55,159 వాహనాలు అమ్ముడయితే  2019 డిసెంబర్ లో కేవలం 1,42,126 మాత్రం అమ్ముడు పోయాయి. మోటార్ సైకిళ్లకు సంబంధించి  పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.  ఇందులో సేల్స్ 12.01 శాతం పడిపోయాయి.ఈ డిసెంబర్ లో 6,97,819 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 7,93,042 యూనిట్లు అమ్ముడు బోయాయి.
ఇక టూవీలర్లకు సంబంధించి పతనం మరీ ఎక్కువగా 16.6 శాతం  నమోదయ్యింది. ఈ డిసెంబర్ లో 10,50,038 వాహనాలు అమ్ముడుపోయాయి. అదే గత ఏడాది డిసెంబర్ లో12,59,007 యూనిట్లు సే ల్ అయ్యాయి.
ఇక కమర్షియల్ వాహనాల విషయానికి వస్తేఅమ్మ కాలు 12.32 శాతం పడిపోయాయి. అమ్ముడయినవి కేవలం66,622 వాహనాలు మాత్రమే. అన్ని రకాల వాహానాలు కలిపితే కొనుగోళ్లు 13.08 శాతం పడిపోయాయి. ఈ డిసెంబర్ లో 14,05,776 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే గత ఏడాది 16,17,398 యూనిట్లు సేల్ అయ్యాయి.
ప్యాసెంజర్ వాహనాలన్నింటిని కలిపితే సేల్స్ 2019లో (29,62,052)  12.75 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇవే33,94,790 యూనిట్లు అమ్ముడుపోయాయి.