తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఆంక్షలు, లోకల్ లాక్ డౌన్

కరోనా కేసులు విపరీతంగాపెరుగుతూ ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇపుడు అంక్షలు కఠినతరం చేశారు. లాక్ డౌన్ స్థానికంగా అమలు చేస్తున్నారు.రాష్ట్రంలో కరోనా తీవ్రంగా పెరుగుతున్న జిల్లాలలో తూర్పు గోదావరి జిల్లా ఒకటి. అందుకేఈ జిల్లాలో పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఈ రోజు నుంచి పాక్షిక లాక్ డౌన్ అంక్షలు విధించారు. మళ్లీ పరిస్థితి మెరుగుపడే దాకా ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది.
కొద్ది సేపటి కిందట ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ రోజు నుంచి ఉదయం 6 గంట లనుంచి 11 గంటల దాకా మాత్రమే అంగళ్లు తెరిచి ఉంచుతారు.
కాకినాడ, రాజమహేంద్రవరం, అమాలపురం ప్రాంతాలలో ఈ అంక్షలు అమలులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డినిన్ననే ప్రకటించడంతో ఇపుడు అమలులోకి వచ్చాయి.
సోమవారంనాడు ఒక్కరోజే 367 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా జిల్లాలో 3539 కేసులు కనిపించాయి. ఇపుడు 1883  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇలా కరోనా వ్యాప్తి చెందుతూ ఉండటంతో కోవిడ్ ప్రాంతాలలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. అందువల్ల ప్రజలు ఎంతో అవసరమయితేనే బయకు రావాలి.కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆయన హెచ్చరించారు.
యువకులను కలెక్టర్ ప్రత్యేకంగా హెచ్చరిస్తూ టూవీలర్స్ మీద ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడవద్దని చెప్పారు. ఇలా యువకులు ఇష్టాను సారం బయటకురావడాన్నితల్లితండ్రులు కూడా నియంత్రించాలని ఆయన చెప్పారు. పిల్లలకు టూవీలర్స్ ఇవ్వవద్దని కూడా ఆయన చెప్పారు.టూ వీలర్స్ మీద ఇద్దరు, ముగ్గురు తిరగడానికి వీల్లేదని కూడా కలెక్టర్ చెప్పారు.
ఆసుపత్రులు యథావిధిగా పనిచేస్తాయి., ప్రభుత్వాఫీసులు, బ్యాంకులు పరిమిత సిబ్బందితో పనిచేస్తాయి.  తుదరపరి ఉత్తర్వులు వచ్చే దాకా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇక అమలాపురం లో   ఆర్డీవో భవానీ శంకర్ అంక్షల విషయం ప్రకటించారు. దుకాణాలలో ఉన్న వారు కూడా మాస్కులు ధరించాలయిన ఆయనచెప్పారు.  పాలవ్యాపారం కూడా ఉదయం ఆరు నుంచి 11 గంటలవరకుమాత్రమే సాగుతుంది. మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే 24 గంటలు పనిచేస్తాయి. చేపలు, మాంసం దుకాణాలను దివారం పూర్తిగా మూసేస్తారు. వివాహాలకు కేవలం పది మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. బయటకు వచ్చే వారంతా విధిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలని ఆర్డీవొ చెప్పారు.