వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న పరమేశ్వరరెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేకా హత్యతో తనకు సంబంధం లేదన్న ఆయన తనకు 13 వ తారీకు నుండి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు చెప్పాడు. మా కుటుంబం అంతా ఆయనకు విధేయులమని చెప్పిన ఆయన వివేకా హత్య విషయంలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశాడు.
వివేకాకు జగన్ కడప ఎంపీ టికెట్ ఆఫర్ చేసారని తెలిపాడు. అయితే తన పరిస్థితి అంత బాలేదని, షర్మిలని కానీ, విజయమ్మని కానీ బరిలోకి దింపమని సూచించగా కొందరికి కోపం వచ్చిందని వివేకా తనకు చెప్పినట్టు పరమేశ్వరరెడ్డి చెప్పాడు. జగన్ సీఎం అయితే వివేకాకు మంచి స్థానం దక్కేదని, వివేకాకు జగన్ మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు పలువురి ద్వారా తెలిసిందని పరమేశ్వరరెడ్డి అన్నాడు.
జగన్ వద్ద వివేకా స్థానం బలపడటంతో కావాలనే ఇంటి దొంగలే ఈ పని చేసి ఉంటారని పరమేశ్వరరెడ్డి ఆరోపణలు చేశాడు. ఆ ఇంట్లో ఎవ్వరిని నమ్మట్లేదని ఓర్వలేకే ఆయనని దారుణంగా చంపారని ఆయన వాపోయాడు. కొన ఊపిరి ఉన్న సమయంలో బెదిరించి లెటర్ రాయించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. డ్రైవర్ ప్రసాద్ చాలా నమ్మకస్థుడని, అటువంటి దుర్మార్గపు ఆలోచనలు అతనికి లేవని తెలిపాడు. ఎర్రగంగిరెడ్డిని తాను అస్సలు నమ్మట్లేదు అని చెప్పాడు. ముమ్మాటికీ ఇది ఇంటి దొంగల పనే అని వాదించాడు.
ఇది కూడా చదవండి