హీరో నాగార్జున్ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ

బిగ్ బాస్ 3ని నిలిపివేయాలని కోరుతూ ఓయూ జాక్ నేతలు హీరో నాగార్జున ఇంటిని ముట్టడించారు.
ఒకవైపు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసారని ఆరోపణలు ఉన్న సమయంలో బిగ్ బాస్ ను ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఓయూ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. స్టూడెంట్స్ అరెస్టు వీడియో కింద ఉంది.
బిగ్ బాస్ నిర్వాహకుల మీద ఇప్పటికే హీరోయిన్ గాయత్రి గుప్త, యాంకర్ శ్వేతా రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
సెక్స్ లేకుండా 100 రోజులు ఉండగలరా అని తనను  అడిగినట్లు గాయత్రి ఆరోపించారు. బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయగలరా అని కోరినట్లు శ్వేతా రెడ్డి ఆరోపించారు.