హైదరాబాద్ లో 29 శాతం ముస్లింల దగ్గిరే జనన ధృవీకరణ పత్రాలు: ఒవైసీ

 ఎన్ ఆర్ సి చట్టం అమలు చేస్తే హైదరాబాద్ ముస్లిం ల  మీద తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఇక్కడి ముస్లింలలో కేవలం 29 శాతం మంది దగ్గిర మాత్రమే జనన ధృవీకరణ పత్రాలున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ఎంపి, ఎఐఎమ్ ఐ ఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వెళ్లడించారు.
దేశ వ్యాపితంగా పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్ ఆర్ సి (NRC)కి వ్యతిరేకంగా ఆందోళనలు ముస్లిం నేతల సమావేశమయ్యారు.  అసదుద్దీన్ వొవైసీ ముస్లిం ప్రతినిధులు బృందానికి నాయకత్వం వహించారు.
NRC పై రెండు రోజులు టిఆర్ఎస్ వైఖరి ప్రకటిస్తామని ఈసమావేశంలో  ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని అనంతరం ఒవైసీ తెలిపారు.
ఈ చట్టానికి వ్యతిరేకింగా ఈ నెల 27న నిజామాబాదు లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సమావేశం అనంతరం అసదుద్దీన్ ఓవైసీ  తెలిపారు. ఈ సభలో టిఆర్ ఎస్ మంత్రులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. సభకు టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తో పాటు కలిసివచ్చే పార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తున్నామని చెబుతూ  నిజామాబాద్ సభలో పాల్గొనాల్సిందిగా టిఆర్ఎస్ మంత్రులకు మా ముందే ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు.
‘ జనాభా లెక్కలకు ఎన్ పిఎ  లెక్కలకు తేడా ఉంది. జనాభా లెక్కల్లో పుట్టిన ప్రదేశము తల్లిదండ్రుల వివరాలు అడగరు అడగరు.కానీ ఎన్ పి ఎ లో పౌరసత్వ వివరాలు అడుగుతున్నారు,’ అని ఒవైసీ తెలిపారు.
తెలంగాణలో 29 శాతం మంది కి మాత్రమే జనన ధ్రువీకరణ డాక్యుమెంట్లు ఉన్నాయని  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు సమాచార హక్కు ద్వారా వివరాలు తెలిశాయని ఆయన వెల్లడించారు.