దక్షిణాదిన రెండో క్యాపిటల్ ఆలోచనే లేదు: కేంద్రం

దక్షిణభారత దేశంలో రెండో క్యాపిటల్ వస్తుందని ఈమధ్య మీడియాలో తెగ విశ్లేషణలొచ్చాయి.కొందరయితే, హైదరాబాద్ ను యూనియట్ టెరిటరీ (కేంద్ర పాలిత ప్రాంతం)చేస్తారని రాశారు. ఇది రెండో క్యాపిటల్ కు మొదటి మెట్టని వాళ్లో విశ్లేషణ.
ఇంకొందరు మనుగడయే ప్రశ్నార్థకంగా ఉన్న అమరావతి రెండో క్యాపిటల్ అవుతుందన ఆవేశపడ్డారు. దీనికంతటి కారణం, ఢిల్లీలో కాలుష్యం తెగ పెరిగిపోయి వూపిరిపీల్చుకోవడమే కష్ట మవుతూ ఉండటమే. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే చివరకు ప్యూర్ అక్సిజన్ పీల్చుకోవాలంటే రు.250పెట్టి ఒక పావుగంట బార్లో కూర్చోవలసివస్తున్నది.
  దీనికి కొంతమంది రాజకీయాలు జోడించి  ప్రధాని మోది దక్షిణాది ప్రజలను మచ్చిక చేసుకునేందుకు  రెండోక్యాపిటల్ యోచిస్తున్నారని  చెప్పారు.
ఈ మధ్య బిజెపి నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రెండో క్యాపిటల్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి కారణం.
అయితే, రెండో క్యాపిటల్ ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు  హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వక సమాధానం.
దక్షిణ భారత దేశంలో రెండో జాతీయ రాజధాని ఏర్పాటు చేయడంలాంటి అంశం పరిశీలనలో లేదని ఆయన స్పష్టంచేశారు.