ఎపిలో మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల్లేవు : కమిషనర్

రాష్ట్రంలో ని 15 మునిసిపల్ కార్పొరేషన్ లకు గాను 12 మునిసిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికల నిర్వహిస్తున్నాము
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు మూడు మునిసిపల్ కార్పొరేషన్ లకు కోర్ట్ ఉత్తర్వులకు లోబడి డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్, తదితర కారణా లు కారణంగా జరపడం లేదు. ఇలాగే16 పుర, నగర పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించడం లేదు.
న్యాయస్థానాల్లో కేసులు తేలాకా అక్కడ ఎన్నికలు నిర్వహిస్తాం.  స్థానిక ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను వినియోగించడం లేదు.

ఎన్నికలు జరగని పుర, నగర పంచాయతీలు:
రాజాం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట

అదేవిధంగా 104 మునిసిపాలిటీ/నరగ పంచాయతీ లకు గాను 75 వాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము.
ఎన్నికల ప్రవర్తన నియమావళి కి అనుగుణంగా ఎన్నికల పరిశీలకులు తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశామన్నారు.
మునిసిపల్ లోకల్ బాడీస్ స్థానాలు కోసం ఎన్నికలు ఒకే దశలో నిర్వహించడం జరుగుతుంది.
నోటిఫికేషన్ జారీ తేదీ : 9.3.2020
రిటర్నింగ్ అధికారి/ ఎన్నికల అధికారి చే ఎన్నికల నోటీస్ జారీ తేదీ: 11.03.2020
నామినేషన్లు ప్రక్రియను తేదీ : 11.3.2020 నుంచి 13.03.2020 వరకు
నామినేషన్లు పరిశీలన తేదీ: 14.3.2020
అభ్యర్థిత్వము ల (నామినేషన్లు) ఉపసంహరణ తేదీ: 16.3.2020 మ. 3 .00 వరకు
పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ తేదీ :16.3.2020 మ. 3 .00 తరువాత
పోలింగ్ నిర్వహించే (అవసరమైన పక్షంలో) తేదీ: 23.03.2020 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు
ఓట్ల లెక్కింపు తేదీ: 27.3.2020 ఉదయం 8 గంటల నుంచి
ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఫలితాలు ప్రకటన చెయ్యడం జరుగుతుంది
ఈ విలేకరుల సమావేశంలో మునిసిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ విజయ కుమార్, సెక్ జాయింట్ సెక్రటరీ ఎ. వి.సత్య రమేష్