బెంగళూరులో కరోనా కర్ఫ్యూ… ముదురుతున్న కరోనా సెకండ్ వేవ్

కరోనా పరిస్థితి మెల్లిగా కఠిన ఆంక్షలవైపు అడుగేస్తూ ఉంది. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగాపెరగడంతో బెంగళూరుతో సహా పలు ప్రధాన నగరాల్లో కరోనా కర్ప్యూ (రాత్రి పూట కర్ఫ్యూ)విధించారు.

శనివారం రాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 20 దాకా అమలులోఉంటుంది. శుక్ర వారం నాడు ఉన్నట్లుండి 5,576 కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులు ఒక రికార్డు

ఎందుకంటే, గత ఏడాదిలో రాష్ట్రంలో ఎపుడూ ఒకే రోజు ఇంత పెద్ద మొత్తం కరోనా కేసులు బయటపడలేదు.

2020 అక్టోబర్ 8న 5,121కేసులు మాత్రమే కనిపించాయి.
ఈ ఏడాది మార్చి 1 బెంగళూరులో 210 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఇంతవరకు కర్నాటకల్ 7,955 కొత్త కేసులు కనిపించాయి. 46 మరణాలు నమోదయ్యాయి.

నిన్నటి టెస్ట్ పాజిటివిటి రేటు 5.88 శాతం.టెస్టు పాజిటివిటి అంటే పరీక్షించిన వారిలో ఎంత శాతం మంది పాజిటివ్ అనే సంఖ్య. గత 24 గంటలల కర్నాటకలో 1,35,163 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,27,933 పరీక్షలు RT-PCR లు.

బెంగళూరుతో పాటు, తుమకూరు, మంగళూరు, మైసూరు,ఉడిపి, కలబురగి, బీదర్ లలో కర్యూఅమలులో ఉంటుందని ముఖ్యమంత్రి యద్యూరప్ప పేర్కొన్నారు.

రాత్రిపది నుంచి మరుసటి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రత్యేక అనుమతి లేకుండా ప్రజలు మాత్రం రోడ్ల మీద సంచరించడాన్ని కర్నాటక ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.అత్యవసర సర్వీసులు, హోం డెలివరీలు, ఇ-కామర్ వాహనాలను అనుమతిస్తారు. రైల్వే స్టేషన్లకు, విమానాశ్రయాలకు అధికారికి టికెట్ ఉంటే అనుమతిస్తారు. రాత్రిషిఫ్టుల్లో పనిచేసే వారు కర్ఫ్యూ మొదలయ్యే సమాయానికి కార్యాలయాలకు చేరుకోవలసి ఉంటుంది. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *