అంతా బాగుంటేనే ఆఫీసుకు…లేకుంటే WFH : కేంద్రం కొత్త నిబంధనలు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటం, ఇద్దరు సీనియర్ అధికారులు, రక్షణ శాఖ కార్యదర్శి, పిఐటి ప్రిన్సిపాల్ డైరెక్టర్ జనరల్ లకు   కరోనా సోకడంతో కేంద్ర ప్రభుత్వం   ఉద్యోగులకు ‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మళ్లీ వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DOPT) మంగళవారం తెలిపింది.
పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని నిబంధన పెట్టింది.
కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని చెప్పింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రానవసరం లేదు.
కేంద్రం పేర్కొన్న కొత్త నిబంధనలు
ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలి.
అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దు, ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలి. మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలి.  మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలి. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలి. కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.