కరోనా కొత్త రూల్స్, రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెట్టుకో వచ్చు

కేంద్రం కరోనా  కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది.  కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఈ  కొత్త నియమాలకు ప్రకారం  రాష్ట్రాలు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినపుడు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే, లాక్ డౌన్ విధించడానికి వీల్లేదు. దీనికి కేంద్రం పర్మిషన్ అవసరం.  కాకపోతే, ఆఫీస్ టైమింగ్స్ పెంచుకుని ఉద్యోగులు అంతా ఒకే సారి కాకుండా షిఫ్టుల వారీగా పని చేసే ఏర్పాటు చేసుకోవచ్చు.   కంటైన్ మెంట్ జోన్లకు బయట ఎలాంటి పరిస్థితులలో కూడా లాక్ డౌన్ విధించడానికి వీల్లేదు.
Guidelines for Survieillance, Containment and Cautioon పేరుతో ఈ కొత్త కోవిడ్ ప్రొటోకోల్ ను కేంద్రం విడుదల చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి  డిసెంబర్ 31 దాకా అమలులో ఉంటుంది.
నిన్న ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మాట్లాడిన తర్వాత ఈ కొత్త నియమాలు విడుదల చేశారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి మూడో రౌండు కొన్ని రాష్ట్రాలల్లో తీవ్రంగా ఉన్న విషయం  చర్చకు వచ్చింది.
కొత్త ఉత్తర్వులలో కరోనా నివారణ పద్ధతులు కఠినంగా పాటించాలని,   కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించనవారి మీద జరిమానా విధించాలని కూడా  కేంద్రం పేర్కొంది.
మార్కెట్ లలో సంతలలో, బస్సులు, రైళ్లవంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలలో సమాజిక దూరం పాటించే విధానంగా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగానియమాలు విడుదల చేయనుంది.
అంతర్రాష్ట్ర ప్రయాణాలమీద, రవాణా మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వీటికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *