కోడలిని హింసించిన మాజీ హైకోర్టు జడ్జి రామ్మోహన్ రావు మీద కొత్త కేసు

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో మరొక  కేసు నమోదైంది..
కోడలు సింధు శర్మను వేధించిన కేసులో ఆయనపై 354 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నూతి రామ్మోహన్ రావు తో పాటు ఆయన కుమారుడు వశిష్ట, భార్యపై పోలీసులు ఇదివరకే 498a కింద కేసు నమోదు చేశారు..
తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను నూతి రామ్మోహన్ రావు కోడలు సిసిఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు..
దీంతో పోలీసులు అదనంగా 354 సెక్షన్ ను వారం రోజుల క్రితం నమోదు చేశారు.
మరిన్ని వివరాలు 
జస్టిస్ నూతి రామ్మోహన్ రావు అనే పేరు విన్నారుగా. ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు జడ్డిగా ఉండే వారు. తర్వాత మద్రాసు హైకోర్టు జడ్జిగా పని చేసి రిటైరయ్యారు. ఆయన, భార్య, కుమారుడు కలసి వరకట్నం కోసం కోడలు సింధు శర్మ ను హింసించే వారని అరోపణలున్నాయి. దీనికి ఆయన మీద, కుటుంబ సభ్యుల మీద కేసులు నమోదులయ్యాయి. ఇండియన్ పీనల్ కోడ్ , వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 498ఎ (భర్త, బంధువుల చేతిలో భార్య వేధింపులు), 323( ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), 406(నమ్మకాన్ని వమ్ము చేయడం) కింద వారి మీద కేసులు నమోదయ్యాయి.
మాజీ జడ్జి, ఆయన భార్య, కుమారుడు కలసి ఎలాహింసించారో వెల్లడించే వీడియో ఫుటేజ్ ఇపుడు బయటకు వచ్చింది. వైరలయ్యింది.