నిమ్మగడ్డ ప్లేస్ లో నీలమ్ సాహ్ని?

ఈ రోజు రిటైరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని తొందర్లోనే  రాష్ట్ర ఎన్నికల కమిషన్ చీఫ్ గా నియమిస్తారనే వార్త వినబడుతూ ఉంది.
ఆమె 1983బ్యాచ్ ఐఎఎస్ అధికారి. రిటైరయ్యాక ప్రస్తుతానికి ముఖ్యమంత్రి సలహాదారుగా  బాధ్యతలు నిర్వర్తి స్తారు.
ఇపుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్  నిమ్మగడ్డ రమేష్ కుమార్  పదవీ కాలం ఏప్రిల్ లో  ముగుస్తుంది. అపుడు ఆ పదవిలోకి నీలం సాహ్ని వస్తారని బలంగా వినబడుతూ ఉంది. రమేష్ కుమార్ , రాష్ట్ర ప్రభుత్వం మధ్య లీగల్ వార్ నడుస్తున్నసంగతి తెలిసిందే. ఆయన్న వదించుకోవాలని రాష్ట్రప్రభుత్వం, కొనసాగితీరాలని రమేష్ కుమార్ కోర్టులో పోరాడుతున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గత తెలుగుదేశం ప్రభుత్వం 2016 ఏప్రిల్ 1 న నియమించింది. 2019లో అధికారంలోకి వచ్చాక, నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నత పదవుల్లో నియమించిన వారిని, కీలకపదవుల్లో నియమించిన చిన్న చిన్న అధికారు (డిఎస్ పి స్థాయి వారు)లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించింది. వారంతా కమ్మవారనో, టిడిపి ఏజంట్లోనో ముద్రవేసి తప్పించేశారు
మిగిలింది ఒకే ఒక్క అధికారి, అది నిమ్మగడ్డ రమేష్ కుమార్. రమేష్ కుమార్ అంత ఈజీగా వెళ్లే బాపతుకాదు. ఆయనది  రాజ్యాంగ హోదా. ఈ పదవికి చాలా భద్రత ఉంటుంది. అందుకే జగన్ ప్రభుత్వం ఏమి చేసినా ఆయన కోర్టుకు వెళ్లి పోరాడి తన హక్కులను, హోదాను కాపాడుకుంటున్నారు.
ఒకసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి రమేష్ కుమార్ ని తొలగించి, తమిళనాడుకు చెందిన ఒక రిటైర్డు జడ్జిని నియమిస్తే, ఆయన కోర్టు కు పోయిన ఆర్డినెన్సు కొట్టేయించుకున్నారు.
రమేష్ కుమార్  మేధావి, కార్యదక్షుడు కూడా. నిజానికి ఆయనకు జగన్ కు పేచీ రాకూడాదు. కులం తప్ప మరొక వివాదానికి ఆస్కారమే లేదు.కులం లేని అధికారులు   ఎక్కడ నుంచి వస్తారు. మనది కులరహిత సమాజం కాదుగా!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కులం తగాదా ఎపుడూ ఇంతగా రచ్చ కెక్కలేదు. అది గుసగుసల్లోనే ఉండింది. ఒకకులం వాళ్లను వైఎస్ ఆర్ వేధిస్తున్నారని చంద్రబాబు కూడా ప్రెస్ కెక్కిన సందర్బాల్లేవనే చెప్పాలి.
నిజానికి చంద్రబాబుతో ఆ రోజుల్లో రమేష్ కు  అంత  మంచి సంబంధాలు లేవని కొంతమంది చెబుతారు. అందుకే రాజశేఖర్ రెడ్డి ఆయనను ఆర్థిక శాఖలో కీలకమయిన పదవిలోనే ఉంచారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా రమేష్ కుమార్ కు మచ్చలేదు.
1983 బ్యాచ్ ఐఎఎస్ అధికారులంతా మంచి సమర్థవంతులని ఆ రోజుల్లో  పేరుండేది. అలాంటి రమేష్ కుమార్ కు జగన్ కు విబేధాలు రావడం, తీవ్రంకావడం జరిగింది.
ఏమయితేనేం, ఇపుడు ఏప్రిల్లో ఆయన ఎస్ ఇసి గా రిటైర్ కాగానే, నీలం సాహ్ని ఈ పదవిలోకి రావచ్చనిసీనియర్ అధికారుల మధ్య చర్చనడుస్తూ ఉంది.
1987బ్యాచ్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా గురువారం నాడు బాధ్యతలు చేపడుతున్నారు.
బాధ్యతలు స్వీకరించేందుకు మధ్యాహ్నం 3:15 గంటల ముహూర్తం పెట్టుకున్నారు.  ఇంతవరకు చీఫ్ సెక్రెటరీ గా ఉన్న  నీలం సాహ్ని రిటర్ అవుతున్నారు.
సాధారణంగా ఐఎఎస్ అధికారులు నెలలో ఏ తేదీ న రిటైరయినా నెాలాఖరునన రిలీవ్ చేస్తారు. ఈ రోజు సంవత్సరాంతంలో ప్రభుత్వ అధికారులు ఆమెకు పలకనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *