నిమ్మగడ్డ చేసిన తప్పును నీలం సరిదిద్దాలా ?

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నీలంసాహ్ని నియమితులయ్యారు వారు బాధ్యతలు చేపట్టిన వెంటనే మిగిలిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏకంగా ఎన్నికలను బహిష్కరించింది. మొత్తం తప్పంతా సాహ్నిదే అంటూ ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. సాహ్నిపై విమర్శలు అర్ధరహితం అనకతప్పదు.

ప్రతిపక్ష పార్టీల డిమాండ్లకు అర్థం ఉన్నదా ?

ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా zptc , mptc ఎన్నికలలో భారీగా జరిగిన ఏకగ్రీవాలు అధికార దుర్వినియోగం చేయడం వల్ల జరిగాయి కాబట్టి రద్దు చేసి నూతన నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నాయి. ఆపని చేయడం సాధ్యమా  అన్నది ప్రదానం. సాధ్యం కాదని తెలిసినా డిమాండ్ చేయడం రాజకీయ కోణంలో చేసిందే.

ఏకగ్రీవాలపై తప్పు ఎక్కడ జరిగింది. బాద్యులు ఎవరు

2020 లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు మినహా mptc ,zptc , మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం , నామినేషన్ తీసుకోవడం , పరిశీలన , ఉపసంహరణ లాంటి ప్రక్రియలు పూర్తి అయినది ( మున్సిపల్ వరకు ఉపసంహరణ ప్రక్రియ చివరి రోజు ఎన్నికల వాయిదా పడింది) కొన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలకు డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారపార్టీ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుంది అన్న విమర్శలు చేశాయి. అన్ని బలవంతపు ఏకగ్రీవాలు కాకపోయినా అక్కడక్కడా జరిగాయి అన్నది నిజం. ఈ ఆరోపణలపై చర్యలు ఎవరు తీసుకోవాలి అప్పటి ఎన్నికల కమిషన్. కానీ నిమ్మగడ్డ ఏ మాత్రం పరిశీలన కూడా చేయకుండా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ అక్కడి నుంచి తిరిగి ప్రక్రియ మొదలవుతుంది అని అధికారిక ప్రకటన విడుదల చేసారు. అంటే అప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలకు ఆమోద ముద్రవేసింది నాటి ఎన్నికల కమిషన్ అని చెప్పక తప్పదు. విపక్షాలకు మిగిలింది కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మినహా ఎలాంటి అవకాశం లేదు. నేడు ఆరోపణలు చేస్తున్న ఏపార్టీ కూడా ఆ పని చేయలేదు.

నిమ్మగడ్డ చేసిన తప్పును నీలం సరిదిద్దాలా ?

నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ విపక్షాల పిర్యాదుకు సమాధానం చెప్పకుండా వాయిదా వేశారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి విమర్శలు ఉన్న కారణంగా ఏకగ్రీవాలపై తన ఆదేశాలు వచ్చే వరకు డిక్లరేషన్ ఇవ్వవద్దు అని చెప్పకుండా వాయిదా పడిన చోటు నుంచే ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పి నాటి ఏకగ్రీవాలకు అధికారిక ముద్ర వేశారు. తర్వాత సంబంధం లేని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. అందుకే ఏకగ్రీవాలపై హైకోర్టు కచ్చితమైన ఆదేశాలను జారీచేసింది. ఇప్పటికే డిక్లరేషన్ అందుకున్న వాటిపై సమీక్ష కూడా చేయకూడదని తదుపరి మిగిలిన ఏకగ్రీవాలకు కూడా డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషనర్ గా వచ్చిన నీలంకు ఉన్న అధికారం , బాధ్యత కేవలం తేదీపై నిర్ణయం తీసుకోవడం , ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరపడం మాత్రమే. అన్ని తెలిసిన ప్రతిపక్ష పార్టీలు ఏకంగా ఏకగ్రీవాలను రద్దు చేసి మొదటి నుంచి ప్రక్రియ మొదలుపెట్టమనడం రాజకీయం తప్ప మరోటి కాదు. తిరుపతి ఎన్నికలు ఉన్నందున తర్వాత పెట్టమని ప్రతిపక్ష పార్టీలు కొరవచ్చు అందుకు కమిషన్ కూడా అంగీకారాన్ని తెలిపి ఉండాల్సిన అవసరం ఉంది. అంతకు మించి ఎలాంటి అధికారం లేని పనిని చేయమని కోరి తన పరిధిలో లేని అంశాన్ని డిమాండు చేసి నీలం సాహ్ని పై నిందలు వేయడం అర్ధరహితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *