ఏపీ సీఎం చంద్రబాబుపై నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

నారా భువనేశ్వరి అంటే ఎవరో తెలియని వారుండరు. దివంగత సీఎం, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బసవతారకంల తనయ, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య. అంతేకాదు ఆమె ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఆమె తన భర్త, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఏం మాట్లాడారో కింద చదవండి.

నారా భువనేశ్వరి శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ నాణ్యమైన విద్యని అందించడానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు సైనికుల్లా కష్టపడాలి అన్న ఆమె, చంద్రబాబు జీవితం యువతకు ఆదర్శప్రాయమన్నారు. చంద్రబాబు ముందు చూపుతో హైద్రాబాదును అభివృద్ధి చేసారని కొనియాడారు నారా భువనేశ్వరి.

చంద్రబాబు కూడా నారా భువనేశ్వరిని పలుమార్లు ప్రశంసించారు. ఆమెను చూస్తుంటే చాల గర్వంగా ఉంది అని కూడా అన్నారు. చంద్రబాబు పెళ్ళికి ముందు నుండే రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ నేతలు సహజంగానే చాలా బిజీగా ఉంటారు. అందులోనూ చంద్రబాబు ఒక పార్టీకి అధినేత, సీఎంగా, ప్రతిపక్షనేతగా ఇలా నిత్యం బిజీగా ఉండే నాయకులూ ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం కష్టం. ఇంటిని మా ఆవిడ చక్కగా చక్కదిద్దుతుంది కాబట్టే నేను ప్రశాంతంగా నా విధులు నిర్వర్తించుకోగలుగుతున్నాను అని వివిధ సందర్భాల్లో చంద్రబాబు తన శ్రీమతి నారా భువనేశ్వరిని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *