ఎన్నికలను రౌడీయిజంతో ‘ఏకగ్రీవం’ చేస్తున్నారు: చంద్రబాబు

ఆంధప్రదేశ్ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు  బలవంతంగా ఏకపక్ష ఏకగ్రీవ ఎన్నికలను జరిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంత్రులందిరికి జగన్ టార్గెట్ పెట్టి ఏకగ్రీవం చేయిస్తున్నారని,  ఇలాంటి బోగస్ ఏకగ్రీవాలను  కచ్చితంగా అడ్డుకుంటామని ఆయన ప్రకటించారు.

భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేస్తారా? అని ఆయన ప్రశ్నిస్తూ భయపెట్టినందున 2020లో ఏకంగా 23 శాతం ఏకగ్రీవం చేశారని ఆయన ఆరోపించారు. 2014లో కేవలం 2.67 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014లో ఏకగ్రీవం అయిన జడ్ పిటిసిలు కేవలం  1.15 శాతం, అని, వైసిపి బెదిరించి 2020లో 19 శాతం ఏకగ్రీవం చేశారని ఆయన అన్నారు.

ఈ రోజు చంద్రబాబు నాయుడు  తెలుగుదేశం  పంచాయతీ  ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి.. పంచ సూత్రాలు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆయన ప్రసగించారు.

ఒక మంత్రి  తంబళ్లపల్లెలో కూర్చొని ఏకగ్రీవాలు చేస్తున్నారని అంటూ  ఆ గ్రామాల్లో పోటీ చేసేందుకు ఎవరూ లేరా? అని చంద్రబాబు అన్నారు.

‘పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. ఏకగ్రీవాలపై సీఎం మంత్రులకు టార్గెట్లు పెట్టారని, దీనితో అరాచకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ’అని చంద్రబాబు అన్నారు.

‘పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు జరగకపోయినా రాష్ట్రాన్ని , గ్రామాలను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియాలి. రౌడీయిజంతో చేసే ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం. ఇలాంటి చర్యలతో గ్రామాల్లో నాయకత్వం నిర్వీర్యం అవుతుంది. మాచర్ల, తెనాలి లాంటి ఘటనలు జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోం,’ అని చంద్రబాబు హెచ్చరించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *