నేటి నుండి పార్లమెంటు సమావేశాలు 

పార్లమెంటు చరిత్రలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు నేటి నుండి మొదలవనున్నాయి. దేశంలోకోవిడ్ -19 విస్తరిస్తున్ననేపథ్యంలో ఈ సమావేశాలు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు మొత్తం 18 రోజులపాటు సభా సమరం సాగనున్నాయి. ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 1గం. వరకు లోక్ సభ జరగనుండగా మధ్యాహ్నం 3గం.ల నుండి రా.7గం.ల వరకు రాజ్యసభ నిర్వహించనున్నారు. మొత్తం 18 బిల్లులు, రెండు ఆర్ధిక అంశాలపై చర్చలు సాగనున్నాయి

కరోనా విస్తరిస్తున్న కారణంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. సభలలో సభ్యుల మధ్య పాస్టిక్ సీట్ ఏర్పాటుచేస్తున్నారు. సాధారణంగా నయితే సభ్యులు పొడవాాటి సీట్లలో పక్క పక్కనే కూర్చుంటారు. ఇపుడు కోవిడ్ వల్ల వాళ్ల మధ్య ప్లాస్టిక్ షీటు ఏర్పాటుచేస్తున్నారు. రాజకీయ పార్టీలకు వాటి వాటిసంఖ్యను సభలలో సీట్లు కేటాయించారు. మిగతావారు విజిటర్స్ గ్యాలరీలలో కూర్చుంటారు. ఎవరు ఎక్కడు కూర్చుంటారనే విషయాన్ని  పార్టీలకు వదిలపెట్టారు.  ఎంపిలు డిజిటల్ ఎటెండెన్స్ పద్దతిలో తాము సభకు హాజరయినట్లు నమోదుచేసుకోవచ్చు.దీనికి ప్రత్యేకంగా యాప్ తయారు చేశారు

సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరి అని ఆంక్షలు విధించారు. సభలో సభ్యుల మధ్య దూరంతో  పాటు కావాల్సిన అవకాశాలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచారు.

ఈ సమావేశాలలో పార్లమెంటు సభలు 18 సార్లు సమావేశమవుతాయి. ఇందులో 45 బిల్లులు,  రెండు ఆర్థిక వ్యవహారాలు  అంశాలు, 11 అర్డినెన్స్లు సభల ముందుకు వస్తున్నాయి.సభ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, నిన్న మరణించిన మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కు నివాళులర్పిస్తుంది.