మోహన్ బాబు బిజెపిలో చేరిపోయినట్లేనా?

ఇపుడు వైసిపిలో ఉన్న  ప్రముఖ నటుడు , మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ప్రచారం మొదలయింది. ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులతో కలసి   ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
 సోమవారం ఉదయం కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక కలసి మోహన్ బాబు ప్రధానిన మోదీని కలియడంతో ఈ వార్త షికారు చేయడం మొదలుపెట్టింది.
సుమారు అరగంటకు పైగా మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. ఈ బీజేపీలో చేరాలని మోహన్‌బాబును మోడీ ఆహ్వానించినట్లు ప్రచారం మొదలయ్యేందుకు కారణం ఇదే.
దీనికి మోహన్ బాబు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు  గంటలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కూడా మోహన్‌బాబు కలుస్తున్నారు .
ప్రస్తుతం  మోహన్ బాబులో జగన్ నాయకత్వంలోని వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ లో  ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నపుడు ఆయన వైసిపిలో చేరారు. చంద్రబాబు నాయుడి మీద కోపంతో ఆయన జగన్ కు చేరువయ్యారని చెబుతారు. మోహన్ బాబు నడుపుతున్న కాలేజీలకు పీరియింబర్స్ మెంట్ డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పి ఆరోజుల్లో మోహన్ బాబు సంచలనం సృష్టించారు. అయితే, ఆయన పార్టీలో ఉన్నా ఎలాంటిపాత్ర లేదు. అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఏ బాధ్యత ఇవ్వలేదు,ఈ హోదా రాలేదు.  రాజ్యసభ టికెట్ ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. మోహన్ కోడలు జగన్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అదేమీ రాజకీయాల్లో పనిచేసినట్లు లేదు. క్రియాశీల రాజకీయాాల్లోకి రావాలనుకుంటున్న మోహన్ బాబుకు వైసిపి అనుకూలించకపోవడంతో ఆయనకు ఇక మిగిలింది బిజెపియే.
అందుకే ఆయన ప్రధానిమోదీని, పార్టీ అధ్యక్షుడు షాని కలుస్తున్నారని ఢిల్లీలో వినబడుతూఉంది.