తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్… ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ తాకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున పోటి చేసి గెలిచారు. పార్టీ విధానాలు నచ్చకే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంకా ఏ పార్టీలో చేరుతారనే దాని పై స్పష్టత రాలేదు.

హరిప్రియా నాయక్ ముందుగా టిడిపిలో ఉండేవారు. అనూహ్యంగా 2014 లో ఇల్లెందు టిడిపి టికెట్ దక్కించుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ప్రత్యర్ది కాంగ్రెస్ నుంచి పోటి చేసిన కోరం కనకయ్య  చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో హరిప్రియ పై 11 వేల ఓట్ల మెజార్టీతో కనకయ్య గెలుపొందారు.

2014 లో ఓటమిపాలైనా ఆమె ప్రజల మధ్య ఉన్నారు.. 2014 నుంచి కూడా ఇల్లెందు రాజకీయాలలో చురుకుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోతుండడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లో చేరారు. గత ఏడాది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి అనుచరురాలిగా హరిప్రియా నాయక్ కు పేరుంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరిప్రియ చతురతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెను టిపిసిసి మహిళా విభాగం కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత చత్తీస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ పరిశీలకురాలుగా నియమించారు. నక్సలైట్ ఏరియాలో శక్తివంతమైన మహిళగా హరిప్రియ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఆమె నక్సల్స్ ఏరియాలో కూడా తిరిగారు. ఓ పక్క తాను పోటి చేస్తున్న ఇల్లెందులో ప్రచారం చేసుకుంటూనే సమయం దొరికినప్పడల్లా ఛత్తీస్ ఘడ్ లో పర్యటించి ప్రచారం చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు.

2014లో హరిప్రియా పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోరం కనకయ్య 11 వేల ఓట్లతో గెలవగా, ఇప్పుడు అదే కనకయ్య పై హరిప్రియ 2,600 ఓట్ల ఆధిక్యంతో గెలవడం విశేషం. గిరిజన తెగల వివాదం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో హరిప్రియకు లంబాడాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో సత్తా చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *