Home Breaking ఖమ్మంలో సైకిల్ పై మంత్రి పువ్వాడ చక్కర్

ఖమ్మంలో సైకిల్ పై మంత్రి పువ్వాడ చక్కర్

130
0

నగరంలో పలు అభివృద్ధి పనులు పరిశీలన, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించారు.

ముఖానికి మాస్క్ ధరించి సైకిల్ తొక్కుతూ ఖమ్మం వీధుల్లో తిరుగుత జరుగుతున్నఆయనను చూసి జనం అవాక్కయ్యారు.

మంత్రి అంటే ఆ సీనే వేరు కదా. కార్లు, కాన్వాయ్, పోలీసుల హడావిడి. ఫర్ ఎ చేంజ్,పువ్వాడ ఈ రోజు సైకిల్ మీద తిరిగారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ పద్దతి ఎంచుకున్నారు. ఆయన వెంబడి జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి కూడా ఉన్నారు.

ఇలా రెగ్యులర్ గా ఆయన మెయిన్ రోడ్ల మీద కాకుండా సందుల్లో గొందుల్లో కూడా తిరిగితే చాలా విషయాలు తెలుస్తాయని, ఆయన మళ్లీ గెలిచేందుకు ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటున్నారు.

ఎందుకంటే మంత్రి సైకిల్ మీద ఊరంతా తిరిగే ఊరు దానికదే బాగుపడుతుందని జనం నమ్మకం.

జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, PSR రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను మంత్రి పరిశీలించారు.

పను ల అలస్యం  మంత్రి   గమనించారు. అధికారులను నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here