తెలంగాణ కాంగ్రెస్ సారధి కోమటిరెడ్డి? 26 డిసిసిల మద్దతు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎక్కువ జిల్లాలు సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపి  కోమటి రెడ్డి వెంకటరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
టిపిసిసి కి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎఐసిసి ఇన్ చార్జ్ జనరల్ సెక్రెటరీ మాణికం ఠాగూర్ అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
మొన్న జిహెచ్ ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత పిసిసి పదవికి ఉత్తమ్ కు మార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అభిప్రాయసేకరణ జరుగుతూ ఉంది. చాలా మంది ఈ పదవిని కాంక్షిస్తున్నా, పోటీ ప్రధానంగా కోమటిరెడ్డి, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి మధ్య ఉన్నట్లు చెబుతున్నారు. బిసి లేద దళిత నేతను పిసిసి అధ్యక్షుడిని చేయాలనే డిమాండ్ ఉన్నాప్రస్తుత పరిస్థితుల్లో రెడ్డి వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులో కూడా కోమటిరెడ్డి లేదా రేవంత్ రెడ్డి మాత్రమే కెసిఆర్,బిజెపి లను కుల బలం, ధన బలంతో ఎదుర్కొనగలరని అధిష్టానం భావిస్తున్నదని, వారి మధ్య పోటీ ఉన్నందున సామరస్యంగా, ప్రజాస్వామికంగా కొత్త నేత ఎంపిక కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ ల అభిప్రాయాలను పార్టీ సేకరిస్తూ ఉంది.

బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మద్దతు ఇలా ఉంది:
*కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి 26 మంది జిల్లా అధ్యక్షుల మద్దతు
* పార్టీలో బాగా  సీనియ‌ర్ కావడం వల్ల కోమటిరెడ్డికే అవకాశం ఇవ్వాలని చాలా మంది డిసిసి అధ్యక్షుల అభిప్రాయం
* తెలంగాణ ఉద్య‌మంలో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాడు.పార్టీ దీనిని గుర్తించాలి. పార్టీని ఆర్థికంగాఆదుకునే శక్తి ఉంది.
* త‌ట‌స్థంగా ముగ్గురు జిల్లా అధ్య‌క్షులు వ్యవహరించారు.
* రేవంత్ రెడ్డికి కేవ‌లం ముగ్గురు అధ్య‌క్షుల మ‌ద్ద‌తు మాత్ర‌మే ఉందని తెలిసింది.
* రేవంత్‌కి పార్టీలో సీనియారిటీ లేకపోవడం అడ్డొస్తున్నది.
కోమ‌టిరెడ్డికి మ‌ద్ద‌తు తెలిపిన డీసీసీలు
1.జగిత్యాల
2. ఆదిలాబాద్
3.కొమురం భీం ఆసిఫాబాద్
4.నిర్మల్
5.మెదక్
6.సిద్దిపేట
7.భువ‌న‌గిరి
8.రంగారెడ్డి
9.మహబుబాద్
10.భూపాలపల్లి
11. మహబూబ్నగర్
12 నారాయణపేట
13. నాగర్ కర్నూల్
14. వనపర్తి
15. మంచిర్యాల
16. పెద్దపల్లి
17. రాజన్న సిరిసిల్ల
18 వరంగల్ అర్బన్
19.వరంగల్ రూరల్
20.జనగామ
21.నల్గొండ
22. సూర్యాపేట
23.ఖమ్మం
24.భద్రాద్రి కొత్తగూడెం
25.వికారాబాద్
26.సంగారెడ్డి
త‌ట‌స్థంగా ఉన్న డీసీసీలు
1.మేడ్చల్ మల్కాజిగిరి
2. నిజామాబాద్
3. జోగులాంబ గ‌ద్వాల
రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపిన డీసీసీలు
1. ములుగు
2. క‌రీంన‌గ‌ర్
3. కామారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *