మహారాష్ట్ర, తమిళనాడులలో లాక్ డౌన్ పొడిగింపు

మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయి.
ఈ రెండు రాష్ట్రంలో లాక్ మే 31 లాక్ డౌన్ అమలులో ఉంటుంది, ఆదివారంనాడు ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అజొయ్ మెహతా పొడిగింపు ఉత్తర్వులు చేశారు. కరోనా కేసులలో మహారాష్ర దేశంలో నెంబర్ వన్. తమిళనాడు మూడో స్థానంలో ఉంది. తమిళనాడులో నెలాఖరు దాకా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రిపన్నీర్ సెల్వన్ ప్రకటించారు. అయితే, తమిళనాడు లో నియమాలను బాగా సడలించారు. రాష్ట్రంలో 25 జిల్లాల మధ్య బస్సులు నడపాలని నిర్ణయించారు. రాజధాని చెన్నై తో పాటు మరొక 12 జిల్లాలో, కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున పాత నియమాలు కొనసాగుతాయి. విద్యాసంస్థలు మూసే వుంచుతారు.దేవాలయాలలోకి భక్తులను అనుమతించరు. తమిళనాడులో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు 24 నుంచి బంద్ చేశారు.బస్సులు అనుమతించిన జిల్లాలో ఇ పాస్ అవసరంలేదు.
మహారాష్ట్రంలో 30706 కరోనా కేసులు నమోదయ్యాయి దేశంలో ఈరోజు దాకా నమోదయిన 90927 కేసులలో పాతికభాగం పైగా మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. తమిళనాడు లో 10,585 కేసులు నమోదయ్యాయి.