విజయవాడలో పూర్తి లాక్ డౌన్

విజయవాడ: విజయవాడలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ రోజు  సంచలన నిర్ణయం తీసుకుంది.  నగరంలో మరొక మారు లాక్ డౌన్ విధించి ప్రజలను క్రమశిక్షణ లోకి తీసుకురావాలని నిర్ణయించారు. విజయవాడులో లాక్ డౌన్ ప్రకటిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. అయితే, ఈ సారి ప్రజలను లాక్ డౌన్ కు సమాయత్తం చేసేందుకు మూడు రోజులు గడవు ఇచ్చి లాక్ డౌన్ అమలులో చేస్తున్నారు. ఈనెల 26 వతేదీ నుంచి  లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. వారం రోజుల పాటు అమలులో ఉంటుంది. లాక్ డౌన్ కాలంలో  మెడికల్ షాప్ లను మాత్రమే తెరిచ ఉంచుతారు. ప్రజలెవరూ  వారం రోజులు పాటు బయట తిరగరాదని కూడా కలెక్టర్ చెప్పారు. అవసరమైన నిత్యావసర వస్తువులను రేపు ,ఎల్లుండి లోపు సమకూర్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కేసులు పెరుగుతున్నందున ప్రజలను దారితెచ్చేందుకు వారం కిందట కలెక్టకర్ మాస్క్ లను తప్పని సరి చేశారు.అంతేకాదు, ఫైన్ విధిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ రోజు పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి (వీడియో)

https://trendingtelugunews.com/telugu/breaking/no-mask-attracts-rs-100-fine-in-krishna-district/

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 25 నుంచి లాక్ డౌన్
కరోనా పెరిగిపోతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిసతున్నట్లు కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి ప్రకటించారు.ఈ నెల 25 నుంచి ఇది అమలులోకి వస్తుంది.  ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్ లు, షాపింగ్ మాల్స్ మద్య దుకాణాలు, చిరు వ్యాపారులకు ఉ.గం.6 నుంచి ఉ.గం.10 వరకు అనుమతిస్తారు. వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు యథాతథం. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర ఈవెంట్లు తహసిల్దారు అనుమతితో 10 మందికి మించి పాల్గొనరాదు. అదే విధంగా మాస్క్ తప్పనసరి చేశారు.  మాస్క్ ధరింకపోతే పట్టణ ప్రాంతాల్లో రు.100, గ్రామీణ ప్రాంతాల్లో రు.50 జరిమానా విధిస్తారు. ఆరోగ్య సేతు యాప్ అంతా డౌన్ లోడ్ చేసుకోవాలని కూడా కలెక్టర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. వినియోగించాలి