ధరలు పెంచడంతో రు.30కోట్లు తగ్గిన మద్యం సేల్స్, ఇపుడు బార్ల తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతలుగా  మధ్యం ధరలు 75 శాతం పెంచడం వలన అమ్మకాలు బాగాపడిపోయాయి.  రోజుకు సుమారు 30 కోట్ల రూపాయలు విలువైన మధ్యం అమ్మకాలు తగ్గాయి. ఇపుడు  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు  జారీ చేశారు. దీనితో  బార్లసంఖ్య  840 నుంచి  530 కి తగ్గుగుతంది. చట్ట వ్యతిరేక మధ్యం అమ్మకాలు మరియు మధ్యం రవాణా కు సంబందించి నేరాల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్స్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి ఈ విషయాలు వెల్లడించారు.
చిత్తూరులో ఆయన విలేకరులతో మాటాడుతూ  ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా మధ్య పానం నిషేదం అమలు చేయడం జరుగుతున్నదని  తెలిపారు.
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేసి మధ్యం, ఇసుక మాఫియా పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని,  స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కోసం ప్రత్యేక కమిషనరేట్ తో పాటు ఐ.జి లేదా అంతకంటే పై స్థాయి అధికారిని కమిషనర్ ని నియమిస్తారని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాలో అడిషనల్ యస్.పి స్థాయిలో బ్యూరోని ఏర్పాటు చేసి అందులో 18 మంది పోలీసు అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు.
మధ్య పాన నియంత్రణ కు కటిన చర్యల చేపడుతున్నామని, ఇందులో భాగంగా నాటు సారా నియంత్రణకు ఎక్స్సైజ్ మరియు పోలీసు శాఖలు సమన్వయం తో పని చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ విలేఖర్ల సమావేశంలో చిత్తూరు శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జె.సి డి.మార్కండేయులు,జె.సి(గ్రామ-వార్డు సచివాలయాల అభివృద్ది)వి.వీరబ్రహ్మయ్య, డ్వామా పి.డి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.